సంక్షేమంలో సరికొత్త అధ్యాయానికి సీఎం జగన్ శ్రీకారం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల మేనిఫెస్టోతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మంగళవారం 64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాధానగర్లో విస్తృతంగా పర్యటించి.. 285 ఇళ్లను సందర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలలో నూతన ఉత్సాహం కనపడుతోందని మల్లాది విష్ణు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం 600 కి పైగా హామీలను గుప్పించి చివరకు మేనిఫెస్టోను మాయం చేసిందని.. కానీ మూడున్నరేళ్ల కాలంలో 98 శాతం హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లవలసిన బాధ్యత సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లపై ఉందని చెప్పారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అలాగే బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పేదలకు జీవో నెం.60 ఓ వరం
నగర ప్రజలకు జీవో నెం. 60 ఓ వరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. దీని ద్వారా 100 గజాల లోపు ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందన్నారు. నార్త్ మండల పరిధిలో 423 ఇళ్లను ఇప్పటికే గుర్తించగా.. బర్మాకాలనీకి సంబంధించి 14, రాధానగర్ లో 45 ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరందరికీ ఉచిత రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలియజేశారు. అలా కాకుండా క్రయవిక్రయాలు జరుపుకునేందుకు వీలుగా హక్కుతో కూడిన పట్టా పొందేందుకు నామమాత్రపు రుసుము గజానికి కేవలం రూ. 100 కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లు తెలిపారు. అలాగే 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించడంతో నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కండ్రిక, ఎన్.ఎస్.సి.బోస్ నగర్, పాయకాపురం సహా పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న వేలాది అర్జీలకు పరిష్కారం లభించనుందని వివరించారు.

తిరుమల రాజకీయ క్షేత్రం కాదు
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కి లేదని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. పరమ పవిత్రమైన తిరుమల గూర్చి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఏ ప్రాంతంలో పర్యటిస్తే.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలపై బురద చల్లడం నారా లోకేష్ కు పరిపాటిగా మారిందని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రను కాపీ కొడుతూ.. పల్లె నిద్ర గూర్చి టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ అంత గొప్ప నాయకుడే అయితే.. పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎందుకు ఛీ కొట్టారో సమాధానం చెప్పాలన్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించిన చంద్రబాబు కేబినెట్ మంత్రులలో నారాలోకేష్ కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కనుక తలాతోకా లేని విమర్శలను మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఎస్.కె.ఇస్మాయిల్, అధ్యక్షులు జిల్లెల్ల శివ, నాయకులు యరగొర్ల శ్రీరాములు, పందిరి వాసు, అనిల్, కొక్కొలిగడ్డ నాని, మేడా రమేష్, మీసాల రామకృష్ణ, ఎ.త్రినాథ్, అఫ్రోజ్, శాంతి, వెంకటేశ్వమ్మ, రోహిణి దేవి, నాగమణి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *