Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఉపాధి, వైద్య సహాయం అవసరం ఉన్న పేదలకు అండగా ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు సీనియర్ నాయకులు చలపాటి వెంకటేశ్వరావు తెలిపారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, దర్శిపేట నిరుపేద కుటుంబానికి చెందిన పాండురంగ మురళి కుమార్తె కాలేజ్ ఫీజు కోసం ఇబ్బందులు పడుతున్న విషయం దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా మంగళవారం నాడు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థిని కావ్యశ్రీ ఇంటర్ ఫీజ్ నిమిత్తం 20,000/- రూపాయల ఆర్థిక సహాయన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమలో సీనియర్ నాయకులు చలపాటి వెంకటేశ్వర రావు, శెటికం దుర్గా ప్రసాద్, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం… అభ్యున్నతి గురించే

-జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది -రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *