Breaking News

ఘనంగా టైలర్స్ డే వేడుకల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టైలర్స్ డే సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ , పటమట రజక కళ్యాణ మండపంలో నవ్యాంధ్ర పటమట టైలర్స్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ టైలర్ లకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. తూర్పు నియోజకవర్గంలో టైలర్లు అందరికి ఏ అవసరం వచ్చిన అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నా వెంకటేశ్వరరావు, బాబా వలి, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, రాంబాబు, శెటికం దుర్గా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం

-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్‌.. ఇప్పుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *