విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి

-జాయింట్ కలెక్టర్ నుపుర్ అజయ్
-ముగిసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సైన్స్ తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నుపుర్ అజయ్ అన్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా ఆంధ్రా లయోలా కళాశాలలో పాఠశాల విద్యాశాఖ – ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. ఉపాధ్యాయుల నిర్విరామ కృషి ఫలితంగానే విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు రూపొందించారు. వైద్య, వ్యవసాయ తదితర రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు విద్యార్థుల నుంచి రాబట్టాలని కోరారు. సామాజిక అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న ప్రయోగాలకు వేదికగా లయోలా కళాశాల నిలిచిందన్నారు.
అనంతరం విజయవాడ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లల శ్రేయస్సే ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయమని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వేలకోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మరిన్ని ప్రయోగాలు అద్భుత రీతిలో సైన్స్ ప్రాజెక్ట్లు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి ప్రసంగిస్తూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు రూపొందించి ఘనత సాధించింది అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లను మెరుగుపరిచి, పిల్లల్లో ఉండే జిజ్ఞాసను వెలికి తీయడంలో తోడ్పడుతున్నాయన్నారు. ఆంగ్లమాధ్యమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యారంగాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు పెంపొందించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందన్నారు. మెరుగైన ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విజేతలకు బహుమతులు: రాష్ట్రస్థాయిలో 260 ప్రాజెక్టులలో ఐదు విభాగాలలో మూడేసి చొప్పున 15 ప్రాజెక్టులలో ఉత్తమమైనవిగా న్యాయనిర్ణేతలు ప్రకటించారు. విజేతలకు వారికి జాయింట్ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఆంధ్రాలయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రభు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాపరెడ్డి, కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి, ఎన్టీఆర్ జిల్లా డీఈవో రేణుక, కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా, రాష్ట్ర సైన్స్ అధికారిణి జి.ఆర్.భాగ్యశ్రీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్నాపికలు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయలు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, యోగాసనాలు, మిమిక్రీ, ఇంద్రజాలం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

విజేతలు వీరే:
విభాగం బహుమతి విజేతలు
1.ఎకో ఫ్రెండ్లీ మెటిరీయల్స్ విభాగం: ప్రథమ ఎన్. సుమ,(జెడ్పీహెచ్ఎస్, కొంతమూరు, తూర్పు గోదావరి),
రెండో స్థానం వై.భావన, జెడ్పీహెచ్ఎస్ బిట్రగుంట, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
మూడోస్థానం జి.హరిజష్మిత, జెడ్పీహెచ్ఎస్, బలపనూరు, వైయస్సార్ కడప
2.హెల్త్ అండ్ క్లీన్ నెస్ ప్రథమ కె.పూజితశ్రీ, జెడ్పీహెచ్ఎస్, మేదరమెట్ల, ప్రకాశం
రెండో స్థానం జి.భానుప్రియ, ఎం.పి.యూ.పి.ఎస్, కైరేరు, అనంతపురం
మూడోస్థానం ఎన్.లక్ష్మీనరసింహ, జెడ్పీహెచ్ఎస్, నాగసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా
3.సాప్ట్వేర్ అండ్ యాప్స్ ప్రథమ ఎస్.ఆకాశ్, పీసీఆర్ గవర్నమెంట్ హైస్కూల్, చిత్తూరు
రెండో స్థానం మహేష్ కుమార్, ఏపీ మోడల్ స్కూల్, జట్టిపాళెం, పల్నాడు
మూడోస్థానం కె.వినూత్న, డా. బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం, పశ్చిమ గోదావరి
4. ఎన్విరానిమెంటల్ అండ్ క్లైమేట్ చేంజస్ ప్రథమ వి.యశస్విని, జెడ్పీహెచ్ఎస్, ధర్మవరం, విజయనగరం
రెండో స్థానం సీహెచ్ లీలసత్య శ్రీనాథ్, జెడ్పీహెచ్ఎస్, మట్లపాలెం, పశ్చిమగోదావరి
మూడోస్థానం ఎం.శశాంక్, సీఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్, అమ్మనబ్రోలు, ప్రకాశం
5. మాథమేటికల్ మోడలింగ్ ప్రథమ వి.చరణ్ శ్రీ, ఏఎస్ జెడ్పీహెచ్ఎస్, అన్నదేవరపేట, తూర్పుగోదావరి
రెండో స్థానం జి.గణేశ్, జెడ్పీహెచ్ఎస్, లింగరాజపాలెం, అనకాపల్లి
మూడోస్థానం పి.షహీన్ బి, జెడ్పీహెచ్ఎస్, పెంచికలపాడు, కర్నూలు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *