విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు సర్.సి.వి. రామన్ వినూత్న విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను నేటి తరం విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలని ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. చిన్నరాముడు అన్నారు.
జాతీయ శాస్త్రీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అజిత్ సింగ్‌నగర్‌లోని శుభోదయ ఇంగ్లీషు మీడియంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. చిన్నరాముడు ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా ఎస్. చిన్నరాముడు మాట్లాడుతూ పాధామిక స్థాయి నుండే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆశక్తి కల్పించి సృజనాత్మకత నైపుణ్యం పెంపొందించేందుకు సైన్స్ ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు భావి శాస్త్రవేత్తలు అవసరం ఉందన్నారు. సి.వి.రామన్ అబ్దుల్‌కలాం వంటి ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో కొత్త కొత్త ఆలోచనలతో అనేక పరిశోదనలు చేసి సత్ ఫలితాలను సాధించడం ద్వారా ప్రపంచంలోనే మన దేశ ప్రతిష్టతను ఇనుమడిరప చేశారన్నారు. వారిని స్పూర్తితో తీసుకుని సరికొత్త ఆలోచనలతో పరిశోదనలు చేసేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రాధమిక దశ నుండే శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిక తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్‌లు ఎంతో దోహదపడతాయన్నారు.
శుభోదయ ప్రిన్సిపాల్ బి. శైలజ మాట్లాడుతూ విద్యార్థులలో నివిడీకృతమైన సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ వలన విద్యార్థులలో నూతన ఆలోచనలు కల్పించి బావి శాస్త్రవేత్తలగా తీర్చిదిద్దనున్నట్లు ఆమె తెలిపారు. ప్రదర్శనలో సుమారు 400 ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రదర్శనలో శుభోదయ హైస్కూల్ కరస్పాండెంట్ కౌషిక్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News