Breaking News

రైతు సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శం..

-రైతులకు వ్యవసాయంలో భరోసా కల్పించేందుకు వైయస్సార్‌ రైతు భరోసా అమలు..
-రూరల్‌ మండలంలో 156 మంది రైతులకు 18.82 లక్షల పెట్టుబడి రాయితీ..
-జిల్లాలో మూడవ విడత 1,34,338 మంది రైతుల ఖాతాలలో రూ.29.33 కోట్లు జమ.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృడ నిశ్చయంతో రైతులకు అండగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ రైతు సంక్షేమంలో మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద మూడవ విడత వైఎస్సార్‌ రైతు భరోసా పియం కిసాన్‌ లబ్దిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాలకు జమ చేసిన కార్యక్రమాన్ని గొల్లపూడి లోని రైతు భరోసా కేంద్రం నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, అధికారులతో కలిసి వీక్షించి జిల్లాకు చెందిన రైతులకు చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జనాభాలో 62 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పి.యమ్‌ కిసాన్‌ పథకం కింద 6 వేల రూపాయలను రైతులకు ఆర్థిక సహాయం కింద అందిస్తే కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమంపై ఉన్న ముందు చూపుతో మరో 7,500 రూపాయలను కలిపి 13,500 రూపాయలను అందిస్తున్నారన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుండి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. మనిషికి శరీరం ఎంత ముఖ్యమో భూమికి కూడా అంతే అవసరం అనేది రైతులు గుర్తించాలన్నారు. అవసరాలకు మించి ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మట్టి కలుషిత మవుతుందన్నారు. దీనిని నివారించేందుకు సేంద్రియ ఎరువుల వాడటం వలన భూమిలో న్యూట్రీషిన్‌ పెరిగి భూమి సారవంతమై అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం వుంటుందన్నారు. సొంత వ్యవసాయ భూములు కలిగిన రైతులతో సమానంగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులు, కౌలుదారులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపు చేస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ రైతుకు సహాయం చేస్తే సమాజానికి సహాయం చేసిన్నట్టేనని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా కష్టకాల సమయంలో ప్రపంచ మొత్తం ఆర్థిక మాన్యంతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో మన దేశం ఆర్థికంగా తట్టుకుని నిలబడడానికి కారణం రైతులే అన్నారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నాటిన నాటి నుండి పంటను అమ్ముకునే వరకు రైతులను చేయిపట్టి నడిపిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత నాలుగుఏళ్ళుగా వర్షాలు పుష్కలంగా కురియడంతో రాష్ట్రంలో ఏ ఒక్క మండలం కరువు ప్రాంతంగా ప్రకటించలేదని, భూగర్భజల మట్టాలు పెరుగుతున్నాయని రైతులు ఆశించిన మెరకు దిగుబడులు సాధించగలుగుతున్నారన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు పంట నష్టం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉండేవన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన రైతులకు పంట సీజన్‌ ముగిసే లోపే నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అందుస్తున్న సేవలను గుర్తించిన ఇతర రాష్ట్రాలు మన రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఆర్‌బికెల పని తీరును కొనియాడుతున్నారన్నారు.
శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులు చేపట్టిన పంటను ఇ` క్రాప్‌ విధానం ద్వారా నమోదు చేసి పంట నష్టపోయిన రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించి పారదర్శకంగా నష్టాపరిహారాన్ని చెల్లించడం జరుతుందన్నారు. రైతు భరోసా ఇన్‌పుట్‌ సబ్బిడీ పథకాలను సకాలంలో అమలు చేయడం వలన రైతు ఆత్మహత్యలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, ఉచిత పంట భీమా, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ, సూక్ష్మసెధ్యం, పండ్ల తోటల అభివృద్ధికి సహాయం అందించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రైతులపై ఎటువంటి బారం మోపకుండా కేంద్రం అందించే సాయం కంటే అధికంగా 7,500 రూపాయలను కలిపి ఒక్కొక్క రైతుకు 13,500 రూపాయలను ఆర్థిక సాయంగా అందించి ముఖ్యమంత్రి రైతులను ఆదుకుంటున్నారన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నాగిరెడ్డి, ఏయంసి చైర్మన్‌ కె. సురేష్‌, ఏపి ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ టి. శ్రీకాంత్‌, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ యం శివరామకృష్ణ, ఆర్‌టిసి రీజనల్‌ చైర్‌పర్సన్‌ టి.పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ టి.జమలపూర్ణమ్మ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, జిల్లా వ్యవసాయ అధికారి యం.విజయభారతి, ఎడిఎలు బి.వెంకటేశ్వరావు, యం శ్రీనివాసరావు, డి.రమణ మూర్తి, సిహెచ్‌ శ్రీనివాసరావు, డిప్యూటి ప్రాజెక్టు మేనేజర్‌ విజయకుమారి, జిల్లా అర్టికల్చర్‌ ఆఫీసర్‌ బాలాజీ కుమార్‌, మండల వ్యవసాయ అధికారులు యం. స్వప్న, వాసునాయక్‌, శైలజ, శ్రీనివాస్‌, యంపిపి ప్రసన్న కుమారి, వైస్‌ యంపిపి వేమూరి సురేష్‌, యంఆర్‌వో జహ్నవి, యంపిడివో భార్గవి, జడ్పిటిసి సువర్ణరాజు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *