Breaking News

జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనులను గడువులోపు పూర్తి చేయాలి…

-నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనులను గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుని నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనుల ప్రగతి, స్పందన అర్జీలు, జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంపై స్థానిక కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్లు, యంపిడివోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహాశీల్థార్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పూర్తి చేసి రానున్న ఉగాది నాటికి లబ్దిదారులతో సమూహిక గృహ ప్రవేశాలను జరిపించాలన్న బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారుల కృషి అవసరమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పేదవానికి పక్కా గృహాం అందించాలన్న లక్ష్యం నేరవేర్చడం మన అందరి కర్తవ్యంగా భావించాలన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిలో ఎటువంటి అలసత్వం వహించిన ఉపేక్షించబోనన్నారు. జిల్లాలో జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాలలో ఉగాది నాటికి సుమారు 16 వేలకు పైగా గృహలను లబ్దిదారులతో గృహ ప్రవేశాలు జరిపించాలనే లక్ష్యంగా నిర్థేశించుకున్నామన్నారు. ఇప్పటికే 8,620కు పైగా గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో వివిధ దశలలో ఉన్న 7,727 గృహాలతో పాటు తుది దశలో ఉన్న 2,021 గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తుది దశ నిర్మాణంలో ఉన్న గృహాలకు చెందిన లబ్దిదారులతో తక్షణమే ముఖాముఖి మాట్లాడి నిర్మాణం పూర్తి చేయడంలో వారికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. 3,139 గృహాలు రూప్‌ లెవల్‌ దశలో ఉన్నాయని, 2,567గృహాలు రూప్‌ లెవల్‌ నుండి రూప్‌ కాస్టింగ్‌ దశకు చేరుకోవడం జరిగిందన్నారు. నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పడు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. లబ్దిదారులతో ప్రతి రోజు పరస్పరం చర్చించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూప్‌ లెవల్‌, రూప్‌ కాస్టింగ్‌ దశలో ఉన్న గృహా నిర్మాణాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో ప్రారంభించవలసిన గృహలు, మండలాలు, మున్సిపల్‌ పరిధిలోని లేఅవుట్లలో ప్రారంభించవలసిన గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు.
ఏపి సేవా సర్వీస్‌కు సంబంధించి 1,646 అర్జీలు నిర్థేశించిన గడువులోగా పరిష్కరించవలసి ఉన్నాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 1,035, సివిల్‌ సప్లయి 219, సిపిడిసిఎల్‌ 25, అర్భన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీకి సంబంధించి 298 అర్జీలు ఉన్నాయని విటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జగనన్నకు చెబుదాం ద్వారా 2562 అర్జీలను స్వీకరించగా 422 అర్జీలు పెండిరగ్‌లోఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నాడు నేడు పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదులు, ప్రహరి గోడలు, మరుగుదొడ్లు, వంట షెడ్లు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డిఇ రవికాంత్‌, కలెక్టరేట్‌ భూ విభాగ సూపరిండెంట్‌ యం దుర్గాప్రసాద్‌, జిల్లాకు చెందిన మండల స్పెషల్‌ ఆఫీసర్లు యంపిడివోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కూటమి ప్రభుత్వ విజయాలు వివరించిన పట్టాభిరామ్

-ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *