విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మన తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 19వ డివిజన్ నందు దాదాపు 70 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు బీటి రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఏదైనా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతే అసలు ఆ నియోజకవర్గ న్ని పట్టించుకునేవారు కాదు అని, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసేవారని విమర్శించారు కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో రాష్ట్రం మొత్తాన్ని సమ ప్రాధాన్యత గా అభివృద్ధి చేస్తున్నారు అని, అందుకు నిదర్శనమే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన సరే వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి కి సహకరిస్తున్నారని అన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో జగనన్న జనరంజకంగా పాలన అందిస్తుంటే, దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నాయని ఎద్దేవా చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల మద్దతుతో తిరిగి వైసీపీ నే అధికారం చేపడుతోంది అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొరివి చైతన్య, 19వ డివిజన్ కార్పొరేటర్ రహెనా నాహీద్, కో-ఆప్షన్ మెంబెర్ సయ్యద్ అలీమ్ కార్పొరేటర్లు ప్రవల్లిక, నిర్మలాకుమారి, మాధురి మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News