Breaking News

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి నగర్లో విస్తృతంగా పర్యటించి.. 256 ఇళ్లను సందర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం ఓ అద్భుతమైన కార్యక్రమమని, రాష్ట్రవ్యాప్తంగా ఓ పండుగలా సాగుతున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజ‌ల ఇంటి వద్దకే వచ్చామని, సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజ‌ల‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రజ‌లు వివ‌రించిన స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే పేదలందరికీ ఇళ్ల పథకం తొలిదశ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు స్టేటస్ ను తెలియపరచాలని పీఓయూసిడి విభాగానికి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మహిళా సంక్షేమంపై చర్చకు సిద్ధమా..?
మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గూర్చి మాట్లాడే అర్హత టీడీపీ నేత నారా లోకేష్ కు లేదని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తున్నారో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మహిళా నేతలను అడిగితే చెబుతారన్నారు. కానుకల పేరుతో గుంటూరులో సభపెట్టి ముగ్గురు నిరుపేద మహిళల ప్రాణాలను బలితీసుకున్న చంద్రబాబు మహిళోద్ధారకుడా..? నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. అక్షరాలా రూ. 14,205 కోట్ల రుణ మొత్తాన్ని చెల్లించకుండా అక్కచెల్లెమ్మలను గత టీడీపీ ప్రభుత్వం మోసగించింది మహిళలు మరిచిపోలేదన్నారు. మీ హయాంలో ‘ఎ’ గ్రేడ్‌ గా ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమై ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయింది వాస్తవం కాదా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కానీ ఈ ప్రభుత్వంలో మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను జగనన్న అన్వేషిస్తున్నారని, ప్రభుత్వ పరంగా వారికి ఎంతవరకు సహాయసహకారాలు అందించాలో అన్నీ చేస్తున్నారనన్నారు. కీలక మంత్రిత్వ శాఖలు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో ఆడపడుచులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. 90 శాతం పథకాలు మహిళల పేరిటే అందిస్తూ.. చేయూత, సున్నావడ్డీ, అమ్మఒడి, కాపునేస్తం, ఈబీసీ నేస్తం కార్యక్రమాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు దారులు పరుస్తున్నట్లు వివరించారు.

సీఎం జగన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా..?
పంచాయతీ రాజ్ శాఖ చరిత్రలోనే అసమర్థ మంత్రిగా నారా లోకేష్ గుర్తుండిపోతారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. జన్మభూమి కమిటీలతో సంక్షేమ నిధులను నిలువునా దోచుకున్న తండ్రికొడుకులు.. మొబైల్ ఫోన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి తాడేపల్లి నుండి తెనాలికి హెలికాఫ్టర్లో ప్రయాణిస్తే తప్పేముందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రైతులకు భయపడి స్టేట్ గెస్ట్ హౌస్ నుండి అమరావతికి చంద్రబాబు హెలికాఫ్టర్ లో వెళ్లిన రోజున నాదెండ్ల ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు కాళ్లు మొక్కి.. నేడు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా..? అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు దమ్ముంటే విపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి కె.శకుంతల, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఎస్.కె.ఇస్మాయిల్, అధ్యక్షులు జిల్లెల్ల శివ, నాయకులు యరగొర్ల శ్రీరాములు, అక్తిశెట్టి నారాయణ, పందిరి వాసు, మేడా రమేష్, చెక్కా నరసింహరావు, గురాల యేసు బాబు, మీసాల రామకృష్ణ, అగురు త్రినాథ్, వెంకటేశ్వమ్మ, నాగమణి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్‌ఎస్‌లో అధికారులందరూ తప్పనిసరిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *