ఫిష్‌ రిటైల్‌ అవులెట్ల ద్వారా నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను విక్రయించాలి..

-మత్స్య సంపదకు మార్కెటింగ్‌ సౌకర్యం ద్వారా మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్య సంపదకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి తాజా నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను సూచించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం అమలు కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కమిటి చైర్మన్‌ మరియు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మత్స్య సంపదకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పరిశుభ్రతతో కూడిన మత్స్య ఆహారాన్ని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నెలకొల్పే యూనిట్లు మత్స్యకారుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలన్నారు.
ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజనలో కేంద్రప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ఫిష్‌ రిటైల్‌ అవులెట్లు, ఫిష్‌ రిటైల్‌ మార్కెటింగ్‌ హబ్‌లు, ఫిష్‌ కియోష్క్‌ ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్‌ త్రీ వీలర్‌ మోటర్‌ సైకిళ్ళ పంపిణీ, లైవ్‌ఫిష్‌ అమ్మక కేంద్రాల వంటి యూనిట్లను నెలకొల్పేందుకు సబ్బిడిని అందించడం జరుగుతుందన్నారు. మత్యకారులకు చేపలను వేటాడి జీవనోపాధి కల్పించేందుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన దాదాపు 15 లక్షల చేప పిల్లలను కృష్ణానదిలో విడుదల చేయడం జరిగిందని, మరో 10 లక్షలలో చేప పిల్లలను కొనుగోలు చేసి విడుదల చేయవలసి ఉందని, మూడు యూనిట్ల చేపపిల్లలను విడుదల చేసేందుకు 9 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి మత్స్య సీడ్‌ను సరఫరా చేసే ఏజెన్సీని ఖరారు చేయాలన్నారు. ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఒక్కొక్కటి 20 లక్షల వ్యయంతో 9 ఇన్స్‌లేటడ్‌ వాహనాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్‌ మోటర్‌ సైకిల్‌కు 12 మంది లబ్దిదారులకు మంజూరు చేస్తున్నామన్నారు. 3 లక్షల వ్యయంతో ఐస్స్‌బాక్సులతో కూడిన ఒక మూడుచక్రల వాహనాన్ని, 20 లక్షల రూపాయల వ్యయంతో 14 లైవ్‌ ఫిష్‌ వెండిరగ్‌ కేంద్రాల ఏర్పాటుకు, 10 లక్షల వ్యయంతో 6 లైవ్‌ ఫిష్‌ వెండిరగ్‌ కేంద్రాల ఏర్పాటుకు, 10 లక్షల వ్యయంతో 2 ఫిష్‌ కియోష్క్‌ల ఏర్పాటుకు, 50 లక్షల వ్యయంతో 3 ఫిష్‌ వాల్యూ యాడెడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ యూనిట్‌ ఏర్పాటుకు, 14 లక్షల రూపాయల వ్యయంతో ఒక ప్రెష్‌ వాటర్‌ బయో ఫ్లాక్‌ ఏర్పాటుకు ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అనుమతి మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మత్స్య సంపదను పెంచేలా మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. నగరంలో లైఫ్‌ ఫిష్‌ అమ్మకాలపై ప్రజలు మక్కువ చూపుతున్నారన్నారు. కొనుగోలుదార్లను ఆకర్షించేలా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించడం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య అవులెట్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నగరంలో ఇరిగేషన్‌, ఆర్‌టిసి, నగరపాలక సంస్థ, మార్కెటింగ్‌, పశుసంవర్థక, పంచాయతీరాజ్‌ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించి గుర్తించిన ఖాళీ స్థలాలలో అనుమతుల కొరకు ఆయా శాఖల అధికారులతో చర్చించి అవుట్‌లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వివిరించారు.
సమావేశంలో జిల్లా మత్స్య శాఖ అధికారి ఏ నాగరాజా, డిప్యూటి డైరెక్టర్‌ శ్రీనివాస్‌నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారిణి యం విజయభారతి, డిఆర్‌డిఏ కే. శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాందయ్య, పియంఎస్‌ డైరెక్టర్‌ లంకె గోవిందరాజులు, ఏడి సిహెచ్‌ చక్రాణి, ఎఫ్‌డివోలు పి అఖిల, కె. నాగబద్ర, బి లెనిన్‌బాబు, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వేదిక కానున్నది

-జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి -స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *