Breaking News

రైతులకు ఎటువంటి నష్టం లేకుండా మార్కెట్‌ ధర ప్రతిపాదన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి విస్తరణకు భూ సేకరణ లో రైతులకు ఎటువంటి నష్టం లేకుండా మార్కెట్‌ ధర ప్రతిపాదన నిర్ణయించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ ఫిల్డ్‌ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ రెవెన్యూ అధికారులతో కలిసి జి. కొండూరు మండలం దుగ్గిరాలపాడు, పెంట్రంపాడు, గంగినేనిపాలెం, తెల్లదేవరపాడు, సున్నంపాడు గ్రామాల పరిధిలో మార్కెట్‌ ధర ప్రతిపాదనపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో సేకరించిన భూములకు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా మార్కెట్‌ ధర ప్రతిపాదనలు నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో జాయింట్‌ కలెక్టర వెంట మండల తహాశీల్థార్‌ ఆర్‌ వివి రోహిణిదేవి, మండల సర్వేయర్‌ భాను మంగేష్కర్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూత

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్ధం -మొదటి విడత ఆరు క్లస్టర్ల పరిధిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *