విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలుర ఓపెన్ షెల్టర్ లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు అన్నారు. స్థానిక పూర్ణానందం పేట లోని నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సేవా సంస్థచే నడుపబడుచున్న బాలుర ఓపెన్ షెల్టర్ ను బుధవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు, కమీషన్ మెంబర్ పద్మావతి ఆకష్మిక తనిఖీ నిర్వహించారు. బాలుర నివాస గదులను, బాత్ రూమ్ లను. భోజనశాల ఇతర వసతులను తనిఖీ చేసారు. బాలురకు కల్పిస్తున్న వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధ చేసిన యెడల కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని. హెచ్చించారు.ఇతర జిల్లాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పిల్లలను వెంటనే వారి యొక్క ప్రాంతాలకు తిరిగి పంపించాలన్నారు. ఎక్కువ కాలం పిల్లలను షెల్టర్ లో ఉంచరాదని అన్నారు. తల్లితండ్రులు మరియు వారి యొక్క సంరక్షకుల ఆచూకీ తెలియక పోయినట్లయితే వారికి పేపరు ప్రకటన ద్వారా ఆచూకీ తెలుసుకోవలని, ఆ విధంగా కూడా ఆచూకీ తెలియని పిల్లలను బాలల సంరక్షణా విభాగం మరియు బాలల సంక్షేమ కమిటి ద్వారా దత్తతకు ఏర్పాటు చేయాలని అన్నారు. త్రాగు నీరు, మరియు ఇతర అవసరాల కొరకు పిల్లలకు 24 గం||లు నీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని పిల్లలకు క్రమంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, నాణ్యత కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. బాలల హక్కుల వుల్లంఘనను కమిషన్ సీరియస్ గా తీసుకుంటుందని అన్నారు.
Prajavartha Online Telugu News