Breaking News

డా. కె.ఎల్ రావు పార్క్ ఆధునీకరణ పనులు వేగవంతము చేయాలి

-46వ డివిజన్ లోని పలు ప్రాంతాలు పరిశీలన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పలువురు అధికారులతో కలసి 46వ డివిజన్ పరిధిలో గల డా కె.ఎల్ రావు పార్క్ మరియు పలు విధులలో పర్యటించారు. కె.యల్.రావు పార్కు లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పార్క్ నందు ప్రజలకు అందుబాటులో ఉన్న షేటిల్ కోర్ట్, స్క్రిటింగ్, పిల్లల ఆటపరికరాలు మొదలగు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి 46వ డివిజన్ లోని 145 సచివాలయం పరిధిలో గల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో మేయర్ గారు సచివాలయము సెక్రటరీ, వాలంటీర్, గృహసారధులు, కన్వీనర్లతో కలిసి పెన్షన్స్ పంపిణి చేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నా సంకల్పం… నా దేశం కోసం!

– ఆగస్టు 10 నుంచి 15 వరకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమం – స‌మాజంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *