రిషప్షన్ వేడుకలో సీఎం జగన్

నిడదవోలు,  నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిషప్షన్ వేడుకలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 10:50 గం. లకు నిడదవోలు సబ్బ రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్, సిఎం కు స్వాగతం పలికిన వారిలోజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జెడ్పీ చైర్మన్ లు విప్పర్తి వేణుగోపాల్, కవురు శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఈ రూడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మర్గాని భరత్ రామ్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారీ వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, పలువురు శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. అనంతరం సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులు డా సౌమ్య శ్రీ, వెంకట శివ తేజ లను ఆశీర్వదించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ఉ.11.50 గం. లకు తిరిగి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

-2026లో ఎన్టీఆర్ జిల్లాలో గణనీయంగా తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *