అర్జీలపై పరిశీలన చేసి తగిన చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నిడదవోలు పర్యటన సందర్భంలో పలువురు సిఎం ను కలిసి అర్జీలను ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. ఆయా అర్జీలపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిడదవోలు రాయి పేట కు చెందిన దివ్యంగులు వరిగేటు యేసురాజు తన భార్య దాసరి సునీత దివ్యాంగురాలని డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ లో నైపుణ్యం కలిగి ఉందని ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని సిఎం ను కోరడం జరిగింది. గోపాలపురం కు చెందిన చల్లా వీర నాగరాజు ఉపాధి అవకాశాలు కోసం, తన వృద్దులైన తల్లితండ్రులను వృధ్యప్యం లో పోషించు కోవడానికి ఉద్యోగం కోసం అర్జి అందచేశారు. నిడదవోలు బాలజీపేట కు చెందిన ఎం. శ్రీనివాసులు ప్రభుత్వ ఉద్యోగం ఉందనీ తన కుమార్తె ఎం. చంద్ర గౌరికి గత 9 నెలలుగా దివ్యంగుల పెన్షన్ పథకం నిలిపి వేయడం జరిగిందని, పునరుద్ధరించాలని అర్జిని ఇవ్వడం జరిగింది. నిడదవోలు, 4 వ వార్డు కి చెందిన కుమారి సయ్యద్ గులాబీ కి దివ్యంగుల పెన్షన్ పథకం రావడం లేదని, తన తల్లికి ప్రభుత్వ పెన్షన్ వస్తున్నందున సామాజిక భద్రత పెన్షన్ నిలిపి వేయడం జరిగిందని, పునరుద్ధరించాలని అర్జిని ఇవ్వడం జరిగింది. బొమ్మూరు కి చెందిన తానింక దుర్గా దేవి తన భర్త హెచ్ ఐ వి వలన మరణించారని, 14 సంవత్సరాలు ఎపి ట్రాన్స్ కో లో పని చేసి మరణించారని, అధికారులు చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ప్రయోజనం కలగటం లేదని అన్నారు. తాను తన బిడ్డ ను పోషించుకోవడానికి ఉద్యోగం కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగిందన్నారు. పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన కళాకారులు 2018-19 లో జన్మభూమి కళా ప్రదర్శనలు నిర్వహించామని, ఆనాడు కళా ప్రదర్శనకు చెంది పర్యటన శాఖ, సాంస్కృతిక శాఖ వారి నుంచి ఈ మొత్తం రావలసి ఉందని అర్జి ఇవ్వడం జరిగింది. తదుపరి చర్యలు కోసం సంబంధిత అధికారులు పంపడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *