రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కొవ్వూరు డివిజన్ పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కె మీనా వెలగపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్ పరిధిలో 242 మంది తమ ఓటు హక్కును వినియోగించుకానున్నారని అన్నారు. ఇందులో 107 మంది పురుషులు, 135 మంది మహిళలు, 3 శాసన సభ్యులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కొవ్వూరు ఎంపిడివో కార్యాలయం సమావేశ మందిరంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మాధవీలత వివరించారు. స్థానిక సంస్థలకు చెందిన కొవ్వూరు మునిసిపాలిటీ లో 23 మంది, నిడదవోలు పురపాలక సంఘం పరిధిలో 28 మంది, జెడ్పిటిసి లు 9 మంది, ఎమ్.పీ.టి.సి. సభ్యులు 179 మంది, ముగ్గురు శాసన సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్వో జీ. నరసింహులు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News