Breaking News

కేసరపల్లిలో జగనన్న లేఔట్ సందర్శించిన కలెక్టర్

-లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
-ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని సూచన
-అంతర్గత రహదారుల అభివృద్ధి, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలి-అధికారులను ఆదేశించిన కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జగనన్న లేఔట్ సందర్శించి గృహ నిర్మాణాల ప్రగతి పరిశీలించారు లబ్ధిదారులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ ఎలాట్ చేసిన ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకుంటే అంతర్గత రహదారుల అభివృద్ధితోపాటు విద్యుత్తు, నీటి సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేసరపల్లి లేఔట్ లో మొత్తం 83.12 ఎకరాల్లో 3187 ప్లాట్లు వేసి లబ్ధిదారులకు కేటాయించినట్లు, 1943 గృహ నిర్మాణాలు ప్రారంభం కాగా ఇప్పటివరకు 1743 గృహాలు బిలో బేస్మెంట్ లెవెల్ , 92 బేస్మెంట్ లెవెల్ , 10 రూఫ్ లెవెల్, 6 స్లాబులు పూర్తి, 27 గృహాలు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రు 71.70 లక్షలు పేమెంట్ చేయగా, 68.29 లక్షల విలువైన మెటీరియల్ అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు
గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులలో కేసరపల్లికి చెందిన 823 మంది, గన్నవరంకు చెందిన 641 మందితో పాటు అజ్జంపూడి, అల్లాపురం, బిబి గూడెం, చిక్కవరం, గొల్లనపల్లి, గోపవరపు గూడెం, పురుషోత్తపట్నం గ్రామాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు.
గృహా నిర్మాణాలకు అవసరమైన నీటి సదుపాయం కొరకు బోర్వెల్ ఏర్పాటు చేసి నట్లు, అంతర్గత రహదారి పనులు వాటర్ పైప్ లైన్ పనులు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు.
ముఖ్యంగా లేఔట్ కు ప్రధాన రహదారి నుండి అప్రోచ్ రోడ్డు సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేసరపల్లి ప్రధాన గ్రామానికి సమీపంలో కాలువపై బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదన ఉందని తెలిపారు.
ఇచ్చిన స్థలంలో ప్రతి ఒక్కరు గృహం నిర్మించుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు.
తొలుత అధికారులు డ్వామా పీడీ మరియు పిడి హౌసింగ్ జీవీ సూర్యనారాయణ, ఆర్డీవో పద్మావతి, డిపిఓ నాగేశ్వర నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సత్యనారాయణ రాజు, పంచాయతీరాజ్ ఎస్ ఈ తదితర అధికారులు గృహనిర్మాణాల ప్రగతి, లేఔట్ అభివృద్ధి పనులు పురోగతి కలెక్టర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి గౌసాని, సర్పంచ్ నిడమర్తి సౌజన్య, తాసిల్దారు నరసింహారావు ఎంపీడీవో కే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *