Breaking News

ఈనెల 10 ,11 తేదీల్లో రావి వారి పాలెం శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవం….

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమం ఈనెల 10,11 తారీఖుల్లో అనగా శనివారం, మరియు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుటకు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ అంకమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు కోరారు. శనివారం ఉదయం మోపిదేవి వార్పు వద్ద కృష్ణా నది నందు శ్రీ అంకమ్మ తల్లికి స్నానం చేయించి ఊరేగింపుగా మోపిదేవి మునిశ్రమ తల్లి గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి మోపిదేవి గౌడ పాలెం మరియు గొల్లపాలెం మీదుగా రావివారిపాలెం వరకు రాత్రికి చేరుకుని అక్కడనుండి రావి వారి పాలెం ఊరి చివర ఉన్న శ్రీ నూకాలమ్మ గుడి వద్దకు వెళ్లి అక్కడ సంబరం నిర్వహిస్తారు. అక్కడ నుండి రాత్రికి అంకమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుంటారు. ఆదివారం ఉదయం గ్రామస్తులు అందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ సాంప్రదాయపద్ధంగా రావివారిపాలెం నూకాలమ్మ గుడి వద్దకు సారీ తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పిస్తారు. తరువాత అంకమ్మ తల్లి గుడి వద్ద సంబరం చేసి మొక్కుబడులు నైవేద్యాలు సమర్పిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *