Breaking News

41వ డివిజన్ సమస్యలపై కమిషనర్ కి వినతి పత్రం… : ఎమ్ ఎస్ బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని భవానీపురం 41వ డివిజన్లో రంగున్ షాహెబ్ వీధి, కర్రకట్ట నార్త్ నివసిస్తున్న ప్రజలు సైడ్ కాలువలు , డ్రైనేజి సమస్య తో ఇబ్బంది పడుతున్నారని డివిజన్ అధ్యక్షులు సయ్యద్ సుభాని మరియు క్లస్టర్ ఇంచార్జ్ కరిముల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకొని వెళ్లగా దానిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఎండోమెంట్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. దానిని తీసుకోని ఈ రోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్న దీనకల్ పుడరికల్ వారికీ మైనారిటీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్  ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సత్వరమే వాటి మీద చర్య తీసుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, దనేకుల వెంకట సుబ్బారావు, బూర కనకారావు, రాళ్లపూడి మాధవ్,కుప్పుల గంగాధర్ రెడ్డి, సమద్ భాష, ఇస్మాయిల్,ఇస్మాయిల్,జిబి ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము

-వినాయక చవితి శుభాకాంక్షలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఘ్నాలను తొలగించి, శుభాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *