Breaking News

ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన వుండాలి

-అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) k.v సత్యవతి
-జోనల్ కమిషనర్-3 M. కృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందు గల సర్కిల్-3 పరిధి లోని 6 వ మరియు 18 వ డివిజన్ లో ఉన్న అన్ని సచివాలయలను అడిషనల్ కమిషనర్ ( ప్రాజెక్ట్స్) k.v సత్యవతి మరియు జోనల్ కమిషనర్-3 M. కృష్ణ లు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని సచివాలయాల కార్యదర్శులకు అడిషనల్ కమిషనర్ ( ప్రాజెక్ట్స్) సూచించారు. ఎస్.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, సూచించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని తెలిపారు. సచివాలయాలలో జరుగుతున్న పౌర సేవలను , సంక్షేమ పథకాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు, నాడు – నేడు పనుల పురోగతి, ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను జోనల్ కమిషనర్-3 ఆదేశించారు

సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమైన ఇంటివద్దకే సేవలు అదించే కార్యక్రమం లో భాగంగా 13వ తేదిన 18వ డివిజన్ లో జరుగు GSWS వారి ప్రత్యేక కార్యక్రమం లో ప్రజలు అందరూ పాల్గొని వారికి అందని కుల, ఆదాయ దృవపత్రాలు/ సేవలు/ పధకాల పై ఉన్న సమస్యల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు. అందుకని సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరూ ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేసి అందరినీ అవగాహపరచాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *