సమీకృత వ్యాధుల నిఘా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో సమీకృత వ్యాధుల నిఘా కార్యక్రమం (Integrated Disease Surveillance Programme-IDSP) లో సమీకృత ఆరోగ్య సమాచార వేదిక(Integrated Health Information System-IHIP)ద్వారా ప్రభుత్వ మరియు అన్ని ఆరొగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రులలో నమెదైయ్యే వివిధ ప్రకటిత సాంక్రమిక వ్యాధులును వివిధ స్థాయిలలో పటిష్ట నివారణ చర్యలు అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు అన్ని ఆరొగ్య శ్రీ అనుబంధ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్ లు, ల్యాబ్ రేటరీలు ఈ క్రింద తెలియజేసిన పోర్టల్ నందు విధిగా మీమీ సంస్థలులో నమెదైన ప్రకటిత సాంక్రమిక వ్యాధులు ఉదాహరణగా (కలరా, మలేరియా, తరుణ విరోచన వ్యాధులు, డెంగ్యూ,మీజిల్స్, చికెన్ ఫాక్స్,టి.బి) ప్రతిరోజూ పోర్టల్ తెలియజేసిన P-ఫామ్,L- ఫామ్ ని విధిగా నింపవలెను. ఈ కార్యక్రమంలో ఏపిడిమిక్ రావడానికి అవకాశం వున్న వ్యాధులపై నిఘా ఉంచడం ద్వారా ఆ వ్యాధులు వ్యాప్తి, కేసులు నమోదు తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా తదుపరి తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.కావునా అన్ని ప్రభుత్వ మరియు అన్ని ఆరొగ్య శ్రీ అనుబంధ ఆసుపత్రులు మరియు ప్రైవేటు వైద్య సంస్థలు ihip.nhp.gov.in.idspఅనే పోర్టల్ నందు P ఫాం,L- ఫాం నింపాలని తెలియజేయడం జరిగింది. ఈ యెక్క ఆదేశాలు రాష్ట్ర సంచాలకులు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, గొల్లపూడి వారి ఆదేశానుసారం అనుసరించి ఇవ్వడం జరిగినది. అన్ని ప్రభుత్వ మరియు అన్ని ఆరొగ్య శ్రీ అనుబంధ ఆసుపత్రులు మరియు ప్రైవేటు వైద్య సంస్థలు పాటించి వైద్య ఆరోగ్య శాఖ కు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.యం.సుహసిని ఓ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *