విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షయ గ్రూప్ ఆఫ్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద వైద్య విద్యార్థుల కోసం ప్రారంభించినదని ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ భాను ప్రకాష్ అన్నారు. స్థానిక బందర్ రోడ్ లో శుక్రవారం నూతనంగా ప్రారంభించబడిన యోగ్య సూత్రియం, క్షార సూత్ర మరియు లేజర్ ఫైల్స్ క్లినిక్ వెస్ట్ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు,నగర మేయర్ భాగ్యలక్ష్మి ప్రారంభించి డాక్టర్ పట్నాన భాను ప్రకాష్, డాక్టర్ రాగ సుధ లను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను ప్రకాష్, మాట్లాడుతూ అక్షయ హాస్పిటల్స్ 2007 సంవత్సరం మొదలుపెట్టామని అప్పటినుండి ఎన్నో శస్త్ర కర్మలు చేసి ఎంతో అనుభవం సంపాదించామని అన్నారు. ఎన్ సి ఐ ఎస్ ఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ లో సర్జరీ శల్య తంత్ర చేసిన వారికీ 60 రకాల ఆపరేషన్స్ కి అర్హత కల్పించారు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా సుశ్రుత సంహిత లో చెప్పబడిన అష్ట విధ శస్త్ర కర్మలు దాటి ఆధునిక సాంకేతిక విద్యలో ఏమి ఉండవని ఆయన అన్నారు .ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయుర్వేద వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆడవారికి వచ్చే మూల వ్యాధులకు సిగ్గుతోను, బిడియంతోనూ, ఆడ డాక్టర్లు లేకపోవడం వలన చూపించుకోకపోవడం జరుగుతున్నదని, అక్షర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ రాగసుధ ప్రోక్టోలాజిస్ట్, వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. ఆడవారు ముందుకు వచ్చి ఆడవారి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చూపించుకోవలసిందిగా కోరుచున్నామని డాక్టర్ భాను ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మరుపిళ్ల రాజేష్ , మండేపూడి చటర్జీ, గురు మహంతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News