ఘనంగా కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ మూడవ మహాసభలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కెనరా బ్యాంక్‌ గోల్డ్‌ అప్రైజర్‌ మూడవ మహాసభ విజయవాడలోని కబేళా సెంటర్‌, ఊర్మిళానగర్‌లో ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో శనివారం యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఈదరాడ శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. స్థానిక లైన్స్‌ క్లబ్‌ వారి సహకారంతో ఈదరాడ శ్రీనివాసరావు రక్తదాన శిబిరం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించగా సుమారు 48 మంది యూనియన్‌ సభ్యులు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న అప్రైజర్స్‌లో ఉత్తమ ప్రతిభ బ్యాంక్‌కు ఆర్ధిక పురోగతికి పాటుపడిన సుమారు 24 మందికి విజయవాడ రీజన్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రవివర్మ శాలువాతో సత్కరించి బ్యాంక్‌ తరుఫున జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ పి.రవివర్మ మాట్లాడుతూ కెనరా బ్యాంక్‌ ఆర్ధిక ప్రగతిలో గోల్డ్‌ అప్రైజర్స్‌ దే కీలక పాత్ర అని అభివర్ణించారు. అనంతరం యూనియన్‌ జనరల్‌ బాడీ సభ్యులు జనరల్‌ మేనేజర్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 550 మంది యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కయూనియన్‌ సభ్యులకు ఈదరాడ శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలనుండి భాస్కరన్‌, రుద్రయ్య ఆచారి, దొరస్వామి, అశ్విన్‌, జయప్రకాశ్‌ లు పాల్గొనగా జనరల్‌ బాడీ సభ్యులు కె.రంగాచారీ, ఎస్‌.నాగలింగాచారి, ఎం.రమేష్‌బాబు. టి.ప్రభాకర్‌, టి. నరేంద్ర కుమార్‌, అయినంపూడి నాగపద్మ పాల్గొనగా బ్యాంక్‌ యూనియన్‌ అధికారులు వి.ఉదయ్‌కుమార్‌, ఎం.ఎన్‌.వి.ఎన్‌. శ్రీనివాస్‌కుమార్‌, జి.ఓబులేసు, కె.వి.రంగారావు, పడాల రమణ, వై.ఏస్‌.ప్రకాష్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *