Breaking News

జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలల పున:ప్రారంభం ఈ నెల 12 న సోమవారం జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో విద్యకానుక పంపిణీ చేపట్ట నున్నారని , జిల్లాలో మండల విద్యా శాఖాధికారులు వారి పరిధిలోని పాఠశాలల ప్రధానో పాధ్యాయులు విద్యకానుక కిట్ల పంపిణీ కి ప్రజా ప్రతినిధు లు, పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లి దండ్రులు హాజరయ్యేలా చూడాలన్నారు.

ఇప్పటికే మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివో, తహశీల్దార్, ఏం ఈ వో ల అధ్వర్యంలో నాణ్యత పరిశీలించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నాణ్యతలేని, డ్యామేజ్డ్, మిస్ మ్యాచ్ మరియు డిఫెక్టివ్ పుస్తకాలు, వస్తువులను పంపిణీ చేయరాదని అన్నారు. పంపిణీ సమయంలో లోపాలు వుంటే వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేసేలా చూడాలని , ఇందుకోసం సంబంధిత మండల విద్యా అధికారి ద్వారా వివరాలు అందించాలని అన్నారు. జిల్లాకు అందిన విద్యాకానుక వస్తువులు ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులు 1,21,730 మందికి 3 జతల యూనిఫామ్, 1 నుండి 5 వ తరగతి ఆడపిల్లలకు , 1 నుండి 10 తరగతి మగపిల్లలకు కలిపి 83,339 మందికి బెల్టు లు, 1 వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరి లు 7,061 , 6 వ తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరిలు 14,928 , 6 నుండి 10 తరగతి వారికి
1,82,924 నోట్ బుక్ లు , ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులు 1,21,730 మందికి షులు, సాక్సు లు , 1 నుండి 10 వ తరగతి విద్యార్థులకు 9,27,663 టెక్ట్స్ బుక్ లు, 1,21,730 మందికి స్కూల్ బ్యాగుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని సూచనలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *