Breaking News

జూన్ 12 నుంచి జూన్ 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలు జూన్ 12 నుంచి జూన్ 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని స్కూల్స్ ఒంటిపూట బడులను నిర్వహించాలని, ఉత్తర్వులను ఉల్లంఘించిన వాటిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 7.30 నుంచి ఉ.11.30 వరకు మాత్రమే నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉ.8.30 నుంచి ఉ.9.00 గంటల మధ్యలో రాగి జావ ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం ఉ.11 30 నుంచి ఉ.12.00 గంటల మధ్యలో విద్యార్థులకు అందచెయ్యల్సి ఉంటుందని మాధవీలత ఆదేశించడం జరిగిందని జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *