అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటురు విజయవాడ హై-వే నంబూరు గ్రామంలో ఉన్న సిర్రాజుల్ ఉలూం మదరసా నందు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హజ్ యాత్రికుల బస కేంద్రం వద్దకు ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్,మల్లాది విష్ణు,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రూహుల్లా,హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజాం,ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్,కో ఆప్షన్ మెంబెర్ l అలీమ్,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్ లు పర్యటించి హజ్ యాత్రికులను కలిసి వారితో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొని అనంతరం జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర నలములల నుండి హజ్ యాత్రకు వెళ్లేందుకు వచ్చే వారికీ విజయవాడలో హజ్ కమిటి తరపున ప్రత్యక వసతి సదుపాయాలు కల్పించమన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా నున్నప్పుడు హైదరాబాద్, బెంగళురు విమానాశ్రయం నుండి హజ్ యాత్రకు వెళ్ళేవారు .ప్రస్తుత పరిస్థితులలో అలా ఇప్పుడు లేదన్నారు .ఎపి వ్యాప్తంగా 2316 మంది హజ్ యాత్రకు వెళుతున్నారు అని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టిల ప్రభుత్వం అని, మైనార్టిల కోసం అను నిత్యం పని చేసే ప్రభుత్వం మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు .టికెట్ ధరలు పెంచారని ప్రతి పక్షం ఇతర పార్టీలన్నీ కుడా పవిత్రమైనటువంటి హజ్ యాత్రను కుడా రాజకీయం చేయాలనుకోవడం చాల దురదృష్టకరం అని అన్నారు .భారత దేశంలో ఎ ప్రభుత్వం చేయలేని సాహసం ను మన జగన్మోహన్ రెడ్డి చేసి చూపించి మరోసారి మైనార్టిల పక్ష పాతి సిఎం అని నిరుపించుకోన్నారన్నారు.
Prajavartha Online Telugu News