నగరంలో రామ్‌రాజ్‌ కాటన్‌ 250వ షోరూమ్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రామ్‌రాజ్‌ కాటన్‌ 250వ షోరూంను ప్రముఖ నటుడు వెంకటేష్‌ దగ్గుబాటి ప్రారంభించారు. ఎన్టీఆర్‌ జిల్లా, పిన్నమనేని పాలిక్లీనిక్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన ఈ షోరూంను ఆదివారం నటుడు వెంకటేష్‌ దగ్గుబాటి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కాటన్‌ దుస్తులు ధరిస్తే శరీరానికి హాయిగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందన్నారు. నెల్లూరులో 100వ షోరూంను కూడా తానే ప్రారంభించానని, భవిష్యత్తులో 1000వ షోరూంను కూడా తానే ప్రారంభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రామ్‌రాజ్‌ కాటన్‌ దుస్తులు వ్యక్తిలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. విజయవాడలో ఇది మూడోదని, ఆంధ్రాలో అతి పెద్ద షోరూమ్‌ అని వివరించారు. రామ్‌రాజ్‌ కాటన్‌ సంస్థ చైర్మన్‌ కే.ఆర్‌.నాగరాజన్‌ మాట్లాడుతూ ధోతీలు, షర్ట్‌లు, ఇన్నర్‌వేర్లు, నైట్వేర్‌, ఫ్యాబ్రిక్స్‌, కిడ్స్‌ అండ్‌ ఉమెన్స్‌ వేర్లతో పాటుగా అన్ని రకాల శుభకార్యాలకు అవసరమైన వస్త్రాలు తమ షోరూంలో అందుబాటులో ఉంటాయన్నారు. రూ.500 నుంచి రూ.లక్ష వరకు విలువ చేసే 2500 రకాల పంచెలు తమ షోరూముల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. హీరో వెంకటేశ్‌ తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉందని, బిజీ షెడ్యూల్‌ ఉన్నా ఆయన షోరూం ప్రారంభించడానికి అమెరికా నుంచి వచ్చారన్నారు.4 దశాబ్దాల పయనంలో చేనేత కార్మికులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నామని, సుమారు 50,000 మంది రామ్‌రాజ్‌ కాటన్‌ కోసం పనిచేస్తున్నారని నాగరాజన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *