బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు సూచించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో డిఆర్ఓ ఆర్డిఓ ఐ కిషోర్, జడ్పీ సీఈవో జ్యోతిబసు, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
మండల కేంద్రమైన అవనిగడ్డ గ్రామ 5వ వార్డు నివాసి దాడి శ్రీనివాస్ మాట్లాడుతూ సంత మార్కెట్ వైపు లంకమ్మ అమ్మవారి గుడి ఆర్చి దగ్గర మంజూరైన సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించి గతంలో ఉన్నట్లుగా ఆరు మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.
బంటుమిల్లి మండలం రామవరపు మోడీ పంచాయతీ పల్లికొండ వారి మోడీ గ్రామ నివాసి దాసరి విజయ్ కుమార్ తనకు ఆర్ఎస్ నెంబర్ 111/4లో 50 సెంట్లు బంజరు భూమి 1990లో ప్రభుత్వం పట్టా ఇచ్చిందని దాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని గత నెల 25వ తేదీన రాత్రి సమయంలో ఉత్తరం దిక్కున పాలకుర్తి బుల్లి రాజు కుమారులు ముగ్గురు దౌర్జన్యంగా జెసిబి సహాయంతో సరిహద్దురాల్లను తొలగించారని ఈ విషయం బంటుమిల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఉంగుటూరు మండలం వేమండ గ్రామ ప్రజలు హెచ్ నిర్మల గుడివాడ-విజయవాడ వెళ్లాలంటే వేమండ కలవపాముల 40 అడుగుల జడ్పీ రోడ్డు గుండా వెళ్లాల్సి ఉందని ఆ రోడ్డును కలువపాముల గ్రామస్తులు ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మించుకున్నారని తమ గ్రామ ప్రజలు వాహనాలు ఎడ్ల బండ్లు పోవాలంటే ఆక్రమణదారులతో తగాదాలు పోలీస్ కేసులు అవుతున్నాయని ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని డిఆర్ఓ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో డిఆర్వో జిల్లా అధికారులు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. బాల బాలికలపై జరుగుతున్న హింస, దోపిడీ అత్యాచారాలను వ్యతిరేకించాలని, బడి బయట ఉన్న బాలలందరిని బడిలో చేర్చాలని, బాల కార్మిక వ్యవస్థ, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలనకు, ఆపదలో ఉన్న బాలలందరి రక్షణకు అండగా ఉండాలని, బాలల హక్కుల పరిరక్షణ కోసం బాలమిత్రులుగా ఉండాలని, చైల్డ్ లైన్ -1098 కి గాని, పోలీస్ 100/112 లేదా ఉమెన్ హెల్ప్ లైన్ 181 కి గానీ ఫోన్ చేసి తెలపాలని, జిల్లాను బాలల స్నేహ జిల్లాగా చేయుటకు అందరూ తమ వంతు కర్తవ్యం గా నిర్వహించాలని డిఆర్ఓ పిలుపునిచ్చారు. జూన్ మాసం అంతా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయి, సిపిఓ వై శ్రీలత,ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. జనార్ధన్ రాజు ,మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ఐసిడిఎస్ పిడి స్వర్ణ, సహాయ కార్మిక కమిషనర్ గోవిందు, రహదారులు భవనాల ఇంజనీరు శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *