Breaking News

జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ గావించిన మంత్రి జోగి రమేష్

గూడూరు (మల్లవోలు), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు జగనన్న ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు
జగనన్న విద్యా కానుక పథకాన్ని ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించగా, జిల్లాస్థాయి కార్యక్రమం సోమవారం గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేష్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ప్రజా ప్రతినిధులతో కలిసి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ గావించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడు కని విని ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న నాడు నేడు క్రింద సకల సౌకర్యాలు కల్పిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడంతో పాటు వారికి బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబులు అందజేసి, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రతిరోజు పోషకాహారం కలిగిన మెనూతో జగనన్న గోరుముద్ద పధకం అమలు చేస్తున్నారని అన్నారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజే తెలుగు ఇంగ్లీష్ తో కూడిన ద్వి భాష పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ షూస్ బెల్టు వంటి 10 రకాలైన మెటీరియల్ అందించడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. గత ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన విషయం మంత్రి గుర్తుచేస్తూ,ఈ ఏడాది 7వ తరగతి పాసై ఎనిమిదో తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులకు ట్యాబ్స్ అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 43 లక్షల 10 వేల 165 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేస్తుండగా జిల్లా వ్యాప్తంగా 1, 07,029 మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఎలాంటి సౌకర్యాలు లేని మల్లవోలు పాఠశాలలో నేడు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలబడాలని, పదేళ్లలో ప్రతి ఇంటిలో ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దబడనున్నట్లు తెలిపారు.
మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి రెండేళ్లలో పనులు పూర్తి చేసి ఓడలు రానున్నట్లు తద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. వచ్చే నెల నుండి మచిలీపట్నం వైద్య కళాశాలలో 150 మంది విద్యార్థులు వైద్య విద్య ప్రవేశాలు పొందనున్నట్లు తెలిపారు.
ఈఏడాది మల్లవోలు హైస్కూల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన శ్రీవిద్య ,మనోజ్ కుమార్ లను మంత్రి అభినందించి మెమెంటోలు అందజేశారు.
జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ తన బాల్యంలో పాఠశాలల్లో ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదని, మన ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని మీ కలలు సార్ధకం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
డీఈవో తహెరా సుల్తానా మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో కంటెంట్స్ తో పాటు అడ్వాన్స్ కంటెంట్స్ అందించేందుక దీక్ష మోడ్ కు అనుసంధానం చేస్తూ పాఠశాలల్లో ఇంటర్ ఆక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి విషయపరిజ్ఞానం కలిగి ఉండడానికి తోడ్పడుతుందన్నారు.
పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని యోషిత సభలో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న కిట్ వంటి నవరత్నాలు అమలు ద్వారా జగనన్న విద్యార్థులను యువరత్నాలుగా తయారు చేస్తున్నారనిఅన్నారు
ఈ సభలో గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదనరావు, జడ్పిటిసి సురేష్ రంగబాబు, సర్పంచ్ బొర్ర సాంబశివయ్య ప్రసంగించారు.
డిప్యూటీ డిఇఓ యు వి సుబ్బారావు తొలుత సభకు స్వాగతం పలికారు
ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, మరో డైరెక్టర్ గొరిపర్తి వరలక్ష్మి, పెడన ఏఎంసి చైర్పర్సన్ గరికిపాటి చారుమతి రామానాయుడు, పెడల ఎంపిపి శ్రీమతి రాజులుపాటి వాణి అచ్యుతరావు, ఆర్ బి కే చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గొరిపర్తి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నారావు, సీనియర్ నాయకులు తలుపుల కృష్ణారావు, పిఎసిఎస్ అధ్యక్షుడు మురాల వెంకటప్పయ్య, వైస్ ఎంపీపీలు నేతల కుటుంబరావు, పిచ్చుక గంగాధర రావు, ఎంపీటీసీలు రామిరెడ్డి, సాయి కుమారి, పిఎసిఎస్ అధ్యక్షులు దాసరి రమేష్, విద్యా కమిటీ చైర్మన్ పంచకర్ల నరసింహారావు, పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి వెంకటేశ్వరరావు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *