Breaking News

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్ పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్  ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం పలువురు అధికారులతో కలిసి పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌. కమిషనర్ మాట్లాడుతూ ఈ అద్భుత ప్రాజెక్టు పనులను ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పూర్తిచేసుకుని రాష్ట్రానికే తలమాని కంగా నిలవనుంది. 18.18 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 74 అడుగుల ఎత్తు వరకు అంటే ఉదర భాగం వరకు విగ్రహ నిర్మాణం పూర్తయింది. ఆంబేడ్కర్ స్మృతి వనం పనుల కోసం వందలాది మంది కార్మికులు భారీ యంత్రాలతో రాత్రింబవళ్లూ పనులను కొనసాగి స్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టుపై దృష్టి సారించి పనులను సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పనులు శరవే గంగా జరుగుతున్నాయి. స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన స్మృతి నిర్మాణం డిజైన్ల ఆధారంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచారు. సీలింగ్, ప్లాస్టింగ్ పనుల్లో జాప్యం లేకుండా చేస్తున్నారు. పనుల నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రానైట్ ఫుట్పాత్, ల్యాండ్ స్కేప్, కాంపౌండ్ నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నాయి. పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగంణంలో అంద మైన రకరకాల పూలు, ఆకర్షణీయమైన మొక్కలతో గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *