తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని అన్ని విద్యాసంస్థ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, డ్రైవర్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సరియైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవలసిందిగా కే.సీతారామి రెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి, తిరుపతి జిల్లా వారు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా రవాణా కార్యాలయము నందు డి టి ఓ గారు జిల్లా మోటార్ వెహికల్ ఇన్సపెక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. జిల్లా లోని అన్ని విద్యాసంస్థ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, డ్రైవర్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, క్షుణ్ణంగా పరిశీలించి లేని సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. స్కూల్ / కాలేజ్ వాహనాలకు స్పీడ్ లిమిట్ డివైస్ లను కూడా పరిశించాలని , ప్రతిరోజూ విద్య సంస్థ వాహనాలను తనిఖీలు తప్పనిసరి అని తెలియజేసారు. అనంతరం స్కూల్ /కాలేజ్ డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ ఇంచార్జిలతోటి “రెఫ్రెషమెంట్ & శిక్షణ” కార్యక్రమాన్ని ఎస్ వి కాలేజీ, కరకంబాడి రోడ్ నందు రవాణాశాఖ , అగ్నిమాపక శాఖ సిబ్బంది డ్రైవర్లకు తగు సూచనలు తెలియజేసారు. ఈ కార్యక్రమునందు, మోటార్ వెహికల్ ఇన్సపెక్టర్స్ శ్రీనివాస రావు , శ్రీమతి కుసుమ, మెడికల్ ఆఫీసర్ పూజ ఉపాధ్యాయా, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News