కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పట్టణమంతా సుందరీకరణతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే విషయంపై సోమవారం రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి తో చర్చించారు. అనంతరం ఇరువురు అధికారులతో కలిసి కొవ్వూరు పట్టణమంతా పరిశీలించారు. ఏ ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు చేయాలని స్థలాలను పరిశీలించి అభిప్రాయాలను సేకరించారు.
గోష్పాద క్షేత్రం కుడి, ఎడమ రెండువైపులా కోటి 50 లక్షల రూపాయలతో సుందరీ కరణ పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులని దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి మాత విగ్రహం వద్ద సుందరీ కరణ పనుల్లో భాగంగా ‘ఐ లవ్ కొవ్వూరు’ అని నిర్మించాలని హోంమంత్రి అధికారులకు సూచించారు. కొవ్వూరు నాలుగో వార్డ్ లో జిమ్, పిల్లలకు ఆట వస్తువులు వంటి ఏర్పాటు చేయాలని, శివానంద పార్కులో స్కేటింగ్ వీలుగా చేయాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో గ్యారేజ్ పక్కగా ఈట్ అండ్ ఫుడ్ స్ట్రీట్కు ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నారు. విజయ్ విహార్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ లో డివైడర్ మొక్కలతో పాటు గ్రానైట్ తో క్లాడింగ్ చేసి సుందరీకరణ చేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు రుడా వైస్ చైర్మన్ బి బాలస్వామి సెక్రటరీ వీ శైలజ వల్లి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, నియోజవర్గ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News