పాఠశాల ప్రారంభ రోజునే జగనన్న విద్యా కానుక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంక నందు గల APSRM ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా వరుసగా నాలుగో ఏడాది అందజేస్తున్న 400మందికి జగనన్న విద్యా కానుకను తూర్పు నియాజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విద్యార్థిని,విద్యార్థులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు పథకం ద్వారా ఆధునికమైన వసతులతో కూడిన కార్పొరేట్ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. సోమవారం జగన్మోహన్ రెడ్డి వరుసగా నాలుగో ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను పాఠశాల ప్రారంభ రోజునే అందజేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారన్నారు.మన బడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా జగనన్న ప్రభుత్వం – ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా తీర్చిదిద్దింది అని అన్నారు. దీంతో పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌రూంలు, అధునాతన ట్యాబ్‌లు, మెరుగైన టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని,ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది అని,గత టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి కనీసం త్రాగు నీరు,టాయిలెట్లు ఉండేవి కావు అని ఎద్దేవా చేసారు.ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడేళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ అడపా శేషు,డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ,21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,22వ డివిజన్ ప్రెసిడెంట్ జోగా రాజు మరియు వివిధ కార్పొషన్ డైరెక్టర్లు,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు,క్లస్టర్ ఇంచార్జిలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *