తూర్పు నియోజకవర్గంలో అబివృద్దికి పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ నందు డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో దాదాపు 50లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే నేతాజీ నగర్, కరివేపాకు నగర్ సీ సీ రోడ్డు నిర్మాణలకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి.తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీద జరిగిన శంకుస్థాపన లో ముఖ్య అతిధులుగా పాల్గొని భూమి పూజ నిర్వహించడం జరిగింది.

రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో,ప్రాంతానికో పరిమితము కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే సంయున్నత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగిస్తున్నారు అని పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 12వ డివిజన్ లో 6 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, ఉర్దూ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని,అందుకే మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల మధ్యలో తిరుగుతున్నామని ధీమా వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ టీడీపీ వాళ్ళ లాగా శంకుస్థాపన లు చేసి పనులు వదిలేయకుండా అవి పూర్తి అయ్యేవరకు నిత్య పర్యవేక్షణ చేస్తున్నామని,టీడీపీ నాయకులు కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ రోజు పేపర్ లో పడాలని ప్రజలలో అబద్దపు ప్రచారాలు చేసి,మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు అని అన్నారు.ఇక్కడ ఎమ్మెల్యే నివాసం వుండే డివిజన్ అయిన సరే ఎపుడైనా ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకున్నార అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే చాల ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు,వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ డివిజన్ లో అభివృద్ధి జరిగిందని,అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాదే అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,డివిజన్ అధ్యక్షులు ఎమ్.డి రిజ్వాన్ వైస్సార్సీపీ నాయకులు దనేకుల కాళీ,ఇందిరా,మద్దాల రాజేష్,NVD ప్రసాద్,గుళ్ళపల్లి వెంకటేశ్వర రావు పెద్దలు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ కు చెందిన రమణకి జీవనోపాధి నిమిత్తం తగు సహాయం చేయాలని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ని సంప్రదించగా మంగళవారం నాడు వారికి వైయన్ఆర్ చారిటీస్ అధినేత,యలమంచిలి జయ సౌజన్యంతో ఒక ఇస్త్రీ పెట్టెను,అదే డివిజన్ కు చెందిన సిఖిందర్ కుమార్తె చదువు నిమిత్తం 20,000 రూపాయలు, 12వ డివిజన్ కు చెందిన షాభన వైద్య ఖర్చులు నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయన్ని రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ ఇంచార్జిలు పర్వతనేని పవన్ మాగంటి నవీన్ కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *