Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ సూరింటెండెంట్ శేషగిరి స్వాగతం పలికారు. మంత్రి ముందుగా ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ సూపరింటెండెంట్ తీర్థ ప్రసాదాలు అందించారు. మంత్రి తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అమ్మవారి దర్శనానికి ముందు మంత్రి కి రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *