తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్త దాతల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని , ఈ నెల 14 న (నేడు) జరగబోయే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సమీప రక్త కేంద్రాలకు రక్త దాతలను ఎక్కువ సంఖ్యలో సమీకరించాలని సంబంధిత వైద్య అధికారులకు, ప్రోగ్రాం అధికారులకు, సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీహరి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి తెలుపుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువలని తెలపాలన్న ఉద్దేశంతో ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మోడల్ బ్లడ్ సెంటర్ ఎస్విఆర్ఆర్ (రూయ) క్యాంపస్ తిరుపతిలో ఈ నెల తేదీ 14 న రక్త దాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ ప్రపంచ రక్త దాతల దినోత్సవం లో సంవత్సర కాలంలో మూడుసార్లు కంటే ఎక్కువ రక్తదానం చేసిన 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు గల మహిళా దాతలను సత్కరిస్తున్నట్లు తెలిపారు. 25 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారికి సత్కరించి సర్టిఫికెట్లు అందజేస్తామని, అరుదైన బ్లడ్ గ్రూప్ దాతలకు సత్కరించడమే ఈ సంవత్సరం రక్తదాతల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
Prajavartha Online Telugu News