Breaking News

అందుబాటులో గ్రామ స్థాయి నుండే నాణ్యమైన ఉచిత వైద్యం 

-రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో మైలవరం పట్టణంలో రూ.3 కోట్ల నాబార్డ్‌ నిధులతో నిర్మించిన 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి భవనాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
సామాజిక ఆరోగ్య కేంద్రం అత్యవరస విభాగం, మైనర్‌ ఓటి డ్రెస్సింగ్‌ ఇంజక్షన్‌ సర్జికల్‌ వార్డు, ఆర్థోపెడిక్స్‌ ఓపి, జనరల్‌ మెయిల్‌ ఓపెన్‌, ఇసిజి అల్ట్రాసౌండ్‌ల్యాంబ్‌, సర్జికల్‌ ఓపి తదితర విభాగాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం సామాన్య పేద తరగతులు ప్రజానీకానికి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ స్థాయి నుండే వైద్యసేవలను అందుబాటులో ఉంచి ప్రతీ పేదవానికి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, వీటిలో భాగంగా ఈ ఏడాదిలో 5 మెడికల్‌ కళాశాలలు ప్రారంభించనున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 49 వేలకు పైగా నియమకాలు చేపట్టామన్నారు. నాడు`నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 121 సిహెచ్‌సిలు ఆధునీకరించి వైద్య సేవలలో అందించడానికి అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గ్రామస్థాయిలో వైద్యులు రోగుల వద్దకే వెళ్ళి వైద్యం అందించే విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి డయాలసీస్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడం జరిగిందని వైఎస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంతోపాటు పేద ప్రజలకు ఉచిత విద్య అందిస్తున్నారన్నారు. మైలవరం నియోజకవర్గంలో 5 వేల మందికి సియంఆర్‌ఎఫ్‌ కింద చెక్‌ల ద్వారా వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 20 వేల మందికి ఇంటి పట్టాలు అందించడం జరిగిందని, మైలవరం ఎస్‌సి కాలనీలలో రూ.77 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. జి. కొండూరు నుండి గంగినేనిపాలెం వరకు 38 కోట్ల రూపాయలతో కేటాయించి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మైలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలలో సచివాలయ భవనాలు, ఆర్‌బికె కేంద్రాలు నిర్మించుకున్నామన్నారు. నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో డ్రైనేజిల నిర్మించడం జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలలో కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని శాసనసభ్యులు అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత నిస్తుందని నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా అభివృద్ధి చేయడం గర్వించదగ విషయమన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మైలవరానికి ఒక మోడల్‌ హెల్త్‌ సెంటర్‌గా తీర్చిదిద్దాబడ్డాలని దీనికి అనుగుణంగా వైద్యులు సిబ్బంది పారదర్శక సేవలు అందించాలన్నారు. ఆరోగ్య సేవలలో సెకండ్రీ హెల్త్‌ చాలా ముఖ్యమని, కోవిడ్‌ సమయంలో జిల్లా స్థాయి ఆసుపత్రిలో భారం ఎక్కువ అయిన్నప్పుడు ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక హెల్త్‌ సెంటర్లు గ్రామ స్థాయి హెల్త్‌ సెంటర్ల ద్వారా సెకండ్రి హెల్త్‌ సిస్టమ్‌ ఎంతగానో ఉపయోగపడిరదన్నారు. వైద్య ఆరోగ్య సేవలలో ప్రభుత్వం అధిక సంఖ్యలో నియమకాలు చేపట్టి డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, టెక్నికల్‌ సిబ్బందిని నియమించారన్నారు. సిహెచ్‌సిలో సుపరింటెండెంట్‌ స్థాయి, స్పెషాలిస్టు స్థాయిలో కూడా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. చిన్న ఆనారోగ్య కారణంగా జిల్లా ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేదని అందుబాటులో ఉన్న సెకండ్రీ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో ఏపియుపి డైరెక్టర్‌ కమిషనర్‌ డా. వెంకటేశ్వర్‌, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ డా.జె. సుమన్‌, మైలవరం జడ్పిటిసి సభ్యులు ఎస్‌ తిరుపతిరావు, రెడ్డి గూడెం జడ్పిటిసి సభ్యులు విజయబాస్కరరెడ్డి, ఆసుపత్రి కమిటీ అధ్యక్షులు నాగులూరి అజాద్‌, మైలవరం సర్పంచ్‌్‌ మంజు బార్గవి, మైలవరం యంపిపి ఐ. ప్రసన్న రాణి, జి. కొండూరు యంపిపి వెమూల కొండలక్ష్మి దుర్గమ్మ, ఇబ్రహీంపట్నం యంపిపి పాలడుగు జోత్స్న, డిసిహెచ్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *