Breaking News

అచార్య యార్లగడ్డకు “రాజేంద్రస్కృతి” విశిష్ట జాతీయ పురస్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ తెలుగు, హిందీ రచయిత. పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మరో విశిష్ట జాతీయ పురస్కారం వరించింది. వారణాసి (కాశీ) కేంద్రంగా హిందీ భాషాభివృద్దికి జాతీయ స్దాయిలో కృషి చేస్తున్న నాంది సేవా ట్రస్ట్ , నాంది పత్రిక ప్రతి సంవత్సరం అందించే పురస్కారాలలో భాగంగా “ రాజేంద్రస్కృతి ” జాతీయ పురస్కారాన్ని యార్లగడ్డకు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన వారణాసిలో జరిగే ప్రత్యేక వార్షిక సమ్మేళనంలో అచార్య యార్లగడ్డ భాషా కోవిదుల చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డులో భాగంగా నాంది సేవా ట్రస్ట్ లక్ష్మి ప్రసాద్ కు లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందించనుంది. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ తెలుగు సాహిత్యంపై కీలక ప్రసంగం చేస్తారని ట్రస్ట్ అధ్యక్షురాలు శశికళా పాండే ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *