Breaking News

దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలను పంపిణీ చేసిన మంత్రి

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలను పంపిణీ చేశారు. బుధవారం పెడన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పెడన నియోజకవర్గ పరిధిలోని 11 మంది శారీరక దివ్యాంగులకు రూ.10.45 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టడుగు పేద వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే నేడు శారీరక దివ్యాంగులకు ఒక్కొక్కరికీ రూ.95 వేలు విలువ చేసే మూడు చక్రాల వాహనాన్ని ఉచితంగా అందించి వారి జీవితాలకు ఊతాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ఖర్చులను భరిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించిన సహకారంతో జీవితంలో ముందుకెళ్లాలని లబ్ధిదారులను కోరారు. అనంతరం ఆయన జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, జడ్పిటిసిలు సంగా మధుసూదన రావు, వేముల సురేష్ రంగబాబు, ఎంపీపీలు వెలివెల చినబాబు, కూనసాని గరుడ ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వాడ్రేవు కామరాజు, పెడన మున్సిపల్ కమిషనర్ బి.మహేంద్ర, పార్టీ నాయకులు ఎం.రాజబాబు, తలుపుల వెంకట కృష్ణారావు, బండారు మల్లిఖార్జునరావు, నాగబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *