Breaking News

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి -జడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారికా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు అందజేసి నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించాలని జెడ్పి చైర్‌పర్సన్ ఉప్పాల హారికా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మచిలీపట్నంలో జెడ్పి సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీయార్, ఏలారు జిల్లాలకు సంబంధించి 1, 2,3, 4,5, 6,7,వ స్థాయి సంఘసమావేశాలు జరిగాయి. కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికా అధ్యక్షతన ఆమె చాంబర్ లో జరిగిన ఈ సమావేశాల్లో ముందుగా గ్రామీణాభివృద్ధి 2 వ స్థాయి సంఘ సమావేశపు నోటీసును జడ్పి సి ఈ ఓ జ్యోతిబసు చదివి వినిపించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన ప్రగతి, నీటి యాజమాన్య సంస్థలో జరిగిన ప్రగతి, జిల్లా గృహ నిర్మాణ సంస్థలో జరిగిన ప్రగతి, జిల్లా ఉపాధి కార్యాలయములో జరిగిన ప్రగతి, జిల్లా పరిశ్రమల కేంద్రముల శాఖలో జరిగిన ప్రగతి, జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల శాఖలో జరిగిన ప్రగతి, జిల్లా పంచాయితీ కార్యాలయములో జరిగిన ప్రగతి, అద్యక్షుల వారి అనుమతితో ప్రవేశ పెట్టబడిన ఇతర అంశముల గూర్చి చర్చించారు.
కొందరు ప్రభుత్వ అధికారులు వివిధ మండలాలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ సందర్భాలలో జడ్పిటీసీలకు ప్రోటోకాల్‌ నియమ నిబంధనలు పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇకపై వారికి ఎటువంటి సూచన లేకుండా సంబంధిత శాఖాధికారులపై ఉన్నత స్థాయిలో పిర్యాదు చేస్తామని జడ్పి ఛైర్పర్సన్ ఉప్పాల హారికా హెచ్చరించారు.
గన్నవరం మండలం కేసరపల్లి జగనన్న ఇళ్లస్థలాలకు కేటాయించిన లేఔట్ చాలా పల్లంగా ఉందని, 6 అడుగుల మెరక చేయించాలని లేదంటే లబ్ధిదారులు పలు ఇబ్బందులు చెందుతారని ఆ భూమి ఎత్తును పెంచేలా కృషి చేయాలని గన్నవరం ఎంపిపి గౌస్ ఛైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు.
కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి అదే విధంగా గతంలో పరిశ్రమలు నిర్వహిస్తూ బదలాయింపులు జరిగిన సందర్భం లోనూ మార్గదర్శకాల అమలులో పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని జడ్పి ఛైర్పర్సన్ ఉప్పాల హారికా అన్నారు.గతంలో అనుమతులు పొంది, నిర్వహిస్తున్న వాటి విషయంలో సరళీకృత విధానాలను అమలు చెయ్యాల్సి వుంటుందన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోవడంతో పాటు ఆర్ధికంగా బలపడడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో కొత్తగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వారి దరఖాస్తులను తిరస్కరించిన సందర్భంలో ఏఏ అంశాలు ప్రాతిపదికన వాటిని తిరస్కరించారో సంబంధిత దరఖాస్తుదారునికి తెలియజేయాల్సి వుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకట్రావుకు ఆమె సూచంచారు.
ముద్రా పథకం ద్వారా ఎంతమంది చేనేత కార్మికులకు ఇచ్చారని జడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారికా జిల్లా హ్యాండ్లూమ్ , టెక్స్ట్ టైల్స్ అధికారి అప్పారావును ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పథకాలను అందిస్తుందని వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు కొంతమేర వినియోగించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను ప్రచారం చేస్తూ, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అధికారులపై ఉందని సూచించారు. ఆదిశగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. ఎన్ టి ఆర్ జలసిరి పథకాన్నివేసవి కాలంలో అమలు చేయడం ద్వారా నీటి నిల్వల స్థితిగతులు తెలుస్తాయని, వర్షాకాలంలో నీటి నిల్వల స్థాయి పెరిగి ఉంటుందని ఇటువంటి విషయాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను అధిగమించాలని చెప్పారు.
అనంతరం వైస్‌ చైర్మన్‌ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశం జరిగింది వ్యవసాయ శాఖలో జరిగిన ప్రగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. పట్టుపరిశ్రమల శాఖలో జరిగిన ప్రగతి, ఉద్యానవన శాఖలో జరిగినప్రగతి,పశుసంవర్ధక శాఖలో జరిగిన ప్రగతి, మత్స్య శాఖలో జరిగిన ప్రగతి పౌర సరఫరాల శాఖలో జరిగిన ప్రగతి, పౌర సరఫరా సంస్థలో జరిగిన ప్రగతి సహకార శాఖలో జరిగిన ప్రగతి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో జరిగిన ప్రగతి, ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ సేద్య ప్రాజెక్ట్ లో జరిగిన ప్రగతి, అటవీ శాఖలో జరిగిన ప్రగతి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో జరిగిన ప్రగతిపై చర్చించారు.
రైతులందరు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు యంత్ర పరికరాలతో సాగుపనులు త్వరగా ప్రారంభించాలని రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని జడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారికా తెలిపారు.
తర్వాత, చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన విద్య, వైద్య స్థాయీ సంఘ సమావేశం జరిగింది. జెడ్పీటీసీ సభ్యులు దుట్టా సీతారామలక్ష్మి అధ్యక్షతన మహిళ, శిశు సంక్షేమ స్థాయీ సంఘ సమావేశం, వైస్‌చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘ సమా వేశం, చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘ సమావేశం,పనులు స్థాయీ సంఘ సమావేశం జరిగింది
ఈ సమావేశాల్లో ఆయా సంఘాల్లో సభ్యులు గూడూరు జడ్పిటిసి వేముల రంగబాబు, ఘంటసాల జడ్పిటిసి తుమ్మల మురళీకృష్ణ,తో పాటు జడ్పీ సీఈవో జ్యోతిబసు, డ్వామా, హౌసింగ్ పిడి జీవి సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. పద్మావతి, డీపీవో నాగేశ్వరనాయక్‌, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తాహేరా సుల్తానా, కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *