మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2023- 24 సం. 70 లక్షల పని దినాలు కల్పన లక్ష్యం కాగా, కేవలం రెండున్నర నెలల్లో 42.28 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, గడపగడపకు మన ప్రభుత్వం, గృహ నిర్మాణం, రీసర్వే, ఖరీఫ్ ప్రణాళిక అమలు అంశాలపై సమీక్షించారు
కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని వివిధ అంశాలపై జిల్లా ప్రగతి సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద పని దినాల కల్పనలో మాత్రమే కాకుండా రోజువారీ సరాసరి వేతనం రు.250.91 సాధించి జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన 205 సచివాలయల పరిధిలో 838 పనులు గుర్తించగా, మంజూరు చేసిన 794 పనుల్లో 696 పనులు మొదలు పెట్టగా, 670 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రగతికి సంబంధించి జిల్లాలో రు.151 కోట్లతో నిర్మాణం చేపట్టిన 387 గ్రామ సచివాలయం భవనాలలో 171 పూర్తి, రు.82.40 కోట్లతో చేపట్టిన 378 ఆర్బీకే భవనాలలో 100 పూర్తి, రు.47 కోట్లతో చేపట్టిన 268 హెల్త్ క్లినిక్ భవనాలలో 67 పూర్తి కాగా, రు.10 కోట్లతో 53 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, రు.24 కోట్లతో 150 డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం క్రింద 1902 కాల్ సెంటర్కు జిల్లాకు సంబంధించి గ్రీవెన్స్ 1935 వచ్చాయని, వీటిల్లో 1358 పరిష్కారం అయినట్లు తెలిపారు.
గృహ నిర్మాణ ప్రగతికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహాలు పూర్తిచేయాలనే లక్ష్యానికి సంబంధించి జిల్లా లక్ష్యం 19,043 కాగా పెట్టు వరకు 15,641 గృహ నిర్మాణాలు పూర్తి చేసి 82 శాతం లక్ష్యసాధన జరిగినట్లు తెలిపారు.
వైయస్సార్ జగన్ అన్న భూహక్కు భూ రక్ష పథకం కింద జిల్లాలో మొదటి దశలో 100 గ్రామాల్లో రీ సర్వే పూర్తికాగా 1,31,000 సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ పి జాషువా ఏ ఎస్ పి ఆర్. శ్రీహరిబాబు, సిపిఓ వై శ్రీలత, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. శివ నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, పంచాయతీరాజ్ ఎస్ఇ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News