మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారమాధ్యమాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ విసి హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి పి. జాషువాతో కలిసి జిల్లాలోని మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆ పథకాలను సంబంధిత లబ్ధిదారులు అవగాహన చేసుకుని సద్వినియోగపరచుకునే ప్రక్రియలో మీడియా పాత్ర కీలకమన్నారు.
గత నెల 31వ తేదీన 2023- 24 సంవత్సరానికి జిల్లాలోని వివిధ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అప్లికేషన్ కార్డులు మంజూరు చేసింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పోలీస్ అధికారి శ్రీహరి రావు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం వెంకటేశ్వర ప్రసాద్ మీడియా కమిటీ సభ్యులు శేషుబాబు, పైడేశ్వర్రావ్, గణేష్ బాబు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News