Breaking News

సీఎం జగన్ పాలనలో రహదారులకు మహర్దశ

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 35.34 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దాని కంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ బాలభవన్ వద్ద రూ.15.35 లక్షలతో నిర్మించిన నూతన వీఎంసీ శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం R&B కాలనీ లేఔట్ 1 వద్ద రూ.19.99 లక్షలతో నూతన రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ప్రాంతాలపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 14 వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, వీఎంసీ జనరల్ ఫండ్స్.. ఇలా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజావసరాలను తీరుస్తున్నట్లు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో డివిజన్ లో రూ. 25 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ.. రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో కనీసం ఒక చిన్న రోడ్డు వేసిన పాపాన పోలేదని విమర్శించారు. కానీ తాము రహదారుల నిర్మాణానికి సంబంధించి నాలుగేళ్లలో సాధించిన ప్రగతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు దివంగత నేత వంగవీటి మోహనరంగా గారి జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 4వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసిందని.. ప్రజావసరాలను తీర్చడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్ రూపురేఖలలో సమూల మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీనియర్ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, సచివాలయ కన్వీనర్లు కరీముల్లా, రాజశేఖర్, జ్యోతి, గోపిరెడ్డి, నాగబాబు, నాయకులు తోపుల వరలక్ష్మి, శర్మ, శోభన్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *