ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి పి జాషువా తో కలిసి గుడివాడ వైఎస్ఆర్ జగనన్న నగర్ టిడ్కో గృహాల ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వారు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎల్1, ఎల్2, వేదిక పై అసీనుల జాబితా పై దిశా నిర్దేశం చేశారు. తొలుత వారు హెలిపాడు, టిడ్ కో గృహాలు సి-29 బ్లాక్ జీ 1,8డబుల్ బెడ్ రూములు, వైఎస్ఆర్ విగ్రహం అనంతరం బహిరంగ సభ వేదిక గ్యాలరీలు పరిశీలించారు. వేసవి దృష్ట్యా బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, మజ్జిగ తదితర సౌకర్యాలు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. వాహనాల రాకపోకలకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, అదనపు ఎస్పీ శ్రీహరి రావు, టిడ్ కో పి ఓ చిన్నోడు, గుడివాడ మచిలీపట్నం ఆర్డీవోలు పద్మావతి, కిషోర్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, డి ఎస్పీ శ్రీకాంత్, రహదారులు భవనాల ఇంజనీరు శ్రీనివాసు, డి ఆర్ డి ఏ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాద్ జి వి సూర్యనారాయణ డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి ఉద్యాన అధికారి జ్యోతి అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *