Breaking News

దళితుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

-దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటాం
-ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయండి: ఆం.ప్ర ఎస్సి కమిషన్ సభ్యులు చల్లెo ఆనంద్ ప్రకాష్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఎస్ సి కమిషన్ మెంబర్ చల్లెo ఆనంద్ ప్రకాష్ అన్నారు. గురువారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం నందు ఎస్.సి, ఎస్.టి లకు అమలవుతున్న చట్టాలపై ఆర్డీఓ, తాసిల్దార్ పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్ సి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, సంబంధిత అధికారులు ఈ పథకాలు వారికి చేరువ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ కేసులపై దృష్టి పెట్టి పరిష్కారం చూపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని అన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా పోలీస్ శాఖ వారు పూర్తి చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నారు. సమీక్ష అనంతరం ఎస్సి, ఎస్టి సంఘ నాయకుల నుంచి భూ సమస్యల ఫిర్యాదులు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన అర్జీలను కమిషన్ మెంబర్ స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కనక నర్సారెడ్డి, తాసిల్దార్లు, ఎస్సీ ఎస్టీ సెల్ డి ఎస్ పి లు నాగ సుబ్బన్న, రమణ కుమార్, ఈస్ట్ డిఎస్పి సురేంద్ర నాద్ రెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాసులు, వివిధ సంఘాల ప్రతినిధులు మల్లారపు మధు, వసతి గృహాల వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *