-సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని, ప్రాధాన్యత భవనాలు సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, జగనన్న సురక్ష పై సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి వర్చువల్ విధానంలో జగనన్న సురక్ష కార్యక్రమ సన్నద్ధత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలపై, రెవెన్యూ అంశలైన రీ సర్వే, గృహ నిర్మాణ శాఖ కు సంబంధించి ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ పురోగతి, పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కింద ప్రాధాన్యతా భవనాలు పురోగతి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంశాలపై సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ తో కలసి కలెక్టరేట్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సి ఎస్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమ సన్నద్ధత పై సమీక్షిస్తూ జిల్లా, మండలం సచివాలయం వారీగా ఎంపిడిఓ లు, తాశిల్దార్లు శిక్షణ కార్యక్రమాల రూప కల్పన చేసి సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు శిక్షణ పూర్తి చేయాలని, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లు సచివాలయం పరిధిలోని వాలంటీర్లకు, సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. వాలంటీర్లు వారి పరిధిలోని అన్ని గృహాలను సందర్శించి అర్హులైన లబ్ధిదారులు ఇంకనూ మిగిలిపోయి ఉంటే వారికి వివిధ పథకాలకు సంబంధించిన పది రకాల సర్టిఫికేట్లను గతంలో పొందకుంటే వాటిని జగనన్న సురక్ష శిబిరంలో అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తొందర్లో ప్రారంభిస్తున్నారని ఈ లోపు శిక్షణ పూర్తి చేసి అన్ని విధాల సిద్ధంగా ఉండాలని అన్నారు. మార్గదర్శకాల మేరకు అనుసరించాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు జిల్లా కలెక్టర్ వివరిస్తూ గత సంవత్సరం కూలీల హాజరు పురోగతికి మించి ఈ సంవత్సరం లక్ష్య సాధన చేస్తామని తెలిపారు.
సి ఎస్ సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎం అనీమియాతో బాధ పడుతున్న 0-5 సం. ల పిల్లలు, కౌమార దశలో అమ్మాయిలు 10-19 సం. వారు, 15-49 సం. ల గర్భిణీలు, స్టంటేడ్ పిల్లలు, ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల ను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒకే సమాచార వ్యవస్థతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం ప్రధానంగా అనీమియా తో బాధ పడుతున్న పిల్లలకు, ఎత్తు తక్కువ ఎదుగుదల లోపం గల పిల్లలకు అంగన్ వాడి నుండి చిక్కీలు, పాలు, గుడ్లు, వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ, గర్భిణి స్త్రీల లో పోషకాహార లోపం తగ్గించడానికి అవసరమైన ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ సక్రమంగా అందేలా సచివాలయం పరిధిలో తరచూ పర్యవేక్షణ వుండాలని అన్నారు.
రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు. రెండవ దశ రీ సర్వే గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేశన్, ట్రూతింగ్, వెక్టరైజేషన్ తదితర అంశాలు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని, విలేజ్ సర్వేయర్ లాగ్ఇన్, విఆర్ఓ లాగ్ఇన్, తాసిల్దార్ లాగ్ఇన్ లలో ఉన్న అప్రూవల్ లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. డిఎల్ఆర్, ఫైనల్ ఆర్ ఓ ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. మొదటి దశలో రీ సర్వే పూర్తి అయిన 69 గ్రామాల్లో ఎల్పీ ఏం ఆధారిత భూముల రిజిస్ట్రేషన్, ఖాతా మార్పులు చేర్పుల సేవలు సంబంధిత గ్రామ సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో రాష్ట్రంలో త్వరలోనే చేపట్టబోతున్న 5లక్షల గృహ ప్రవేశాలలో భాగంగా మన జిల్లా లక్ష్యాలను అందిపుచ్చుకుని పురోగతి సాధించాలని అన్నారు. అలాగే త్రాగు నీటి కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు ఏర్పాటు, మ్యాజిక్ సోక్ పిట్ లు ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పన జరగాలని అన్నారు.
ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వేగవంతం చేసి సెప్టెంబర్ 15 లోపు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జలజీవన్ మిషన్ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు గత సంవత్సరం సాధించిన ప్రగతికి మించి పురోగతి ఉండేలా పనితీరు ఉండాలని సూచించారు. నరేగా కింద హార్టికల్చర్ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని తెలిపారు.
ఈ సమీక్షలో ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, ఎస్డిసి శ్రీనివాసులు, సిపిఓ అశోక్ కుమార్, డి ఇ ఓ శేఖర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిఎంహెచ్ఓ శ్రీహరి, డిపిఓ రాజ శేఖర్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా జిఎస్ డబ్ల్యుఎస్ అధికారి సుశీల దేవి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News