తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి శేష సాయి వారికి ఘన స్వాగతం లభించింది . జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి, పోర్ట్ఫోలియో జడ్జి చిత్తూరు రవినాథ్ కిలారి, జిల్లా జడ్జి జస్టిస్ భీమా రావు, జస్టిస్ ఎం. గురునాథ్ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ కం మూడవ అదనపు జిల్లా జడ్జి, కోర్టు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనంజయ నాయుడు, తిరుపతి అడిషనల్ ఎస్.పి . కులశేఖర్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, రేణిగుంట డిఎస్పీ భవ్యశ్రీ తదితరులు ఆం.ప్ర హైకోర్టు తాత్కాలిక సిజే గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News