అక్రమ రవాణా బాధిత మహిళలకు రేషన్ కార్డులు ఇవ్వండి – “ విముక్తి “ వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అక్రమ రవాణా బాధిత మహిళలు సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు జారీ చేయాలని అలాగే రేషన్ కార్డులలో ఉన్న తప్పులను సరిదిద్ది కొత్త రేషన్ కార్డులు వెంటనే అందించేలా రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధిత మహిళలు మరియు వ్యాపార లైంగిక దోపిడీకి గురైన బాధిత మహిళల రాష్ట్ర ఫోరం విముక్తి రాష్ట్ర కార్యదర్శి పుష్ప, సంయుక్త కార్యదర్శి మౌనిక తదితర సభ్యులు రాష్ట్ర ప్రభుత్వమును డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించారు. గురువారం “విముక్తి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ను వారి కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1.30లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు వారి నివేదికలు చెబుతున్నాయి, కానీ అందుకు నూరు శాతం అదనంగా రాష్ట్రంలో మహిళలు వ్యభిచార ఊబిలో మగ్గుతున్నారని, వీరిలో వాస్తవంగా 40% మందికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవని పేర్కొంటూ, చివరకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చేర్చాలి అని వెళ్తే రేషన్ కార్డులో పిల్లల పేర్లు లేవని లేదా రేషన్ కార్డు ఏదో జిల్లాలో ఉందని ఇక్కడ చెల్లదని అంటూ వేధిస్తున్నారు. ఫలితంగా సెక్స్ వర్కర్ల పిల్లలు పాఠశాలలకు దూరంగా బాల కార్మికులుగా జీవితాలు వెళ్ళ ధీస్తున్నారు. అదే బాలికల పరిస్థితి అయితే అమ్మలను రోల్ మోడల్ గా తీసుకుని తిరిగి బలవంతంగా ఈ వేశ్య వృత్తిలోకి నెట్టబడుతూ ఉన్నారని విముక్తి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు కావాలి అన్న రేషన్ కార్డ్ అడుగుతున్నారని పేర్కొంటూ, భర్తల వేధింపులు, వరకట్నం వేధింపులు భరించలేక తమ ఇళ్ల నుంచి పారిపోయి వేరే జిల్లాలు పడుపు వృత్తిలో జీవనం వెళ్ళధీస్తున్న సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డు ఒక సమస్యగా మారిందని వెంటనే తమకు రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వమును కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2003లో విడుదల చేసిన జీవో నెం.1లో సెక్స్ వర్కర్లకు అందరికీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా రేషన్ కార్డులు గుర్తింపు కార్డులు ఇస్తాము అని ప్రభుత్వం తెలిపింది, అలాగే 2020 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో సెక్స్ వర్కర్లకు గుర్తింపు కార్డులు అడగకుండానే రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 2020లో జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్స్ వర్కర్లను ఇన్ ఫార్మల్ వర్కర్లుగా గుర్తిస్తూ ఎటువంటి గుర్తింపు కార్డులు అడగకుండానే రేషన్ కార్డులు అందజేస్తూ అన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెక్స్ వర్కర్లు గుర్తించి రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు అందించాలని అలాగే రేషన్ కార్డులో తప్పులను సరిదిద్దు ఇవ్వాలని వారికి సరిదిద్దెల ఆదేశాలు రాష్ట్రంలో అన్ని సచివాలయాలకు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తమ వినతి పత్రం అందజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *