విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కు చెందిన అంగులూరిలక్ష్మి కుమార్తె మరియు 13వ డివిజన్ కు చెందిన చెట్టి లక్ష్మీకుమారుడు ఆర్థిక కారణాలతో చదువు కు ఆటంకం ఏర్పడింది అని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా నేడు వారికి ఫీజుల నిమిత్తం మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేరోక 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,వైస్సార్సీపీ నాయకులు కోలా ఉమా,పచ్చిగోళ్ళ రమేష్,సొంగా రాజ్ కమల్,హనాన్,శ్రీను,గల్లా రవి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News