7వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకి సిద్ధం చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచన- మంత్రి జోగి రమేష్ వెల్లడి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆణిముత్యాలను జిల్లాకు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ వంతు కృషి చేసిన ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలియజేశారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఉత్తమ ఆలోచన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం అన్నారు ముఖ్యమంత్రి జగనన్న పాదయాత్రలో ఆనాటి విద్యా పరిస్థితులు, పాఠశాలలలో పరిస్థితులు స్వయంగా చూసి విద్య వ్యవస్థను సమూలంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించుటకు అమ్మబడి జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుక జగనన్న విద్యాధీన వసతి దీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర విద్యార్థులు రాణించుటకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని అన్నారు. అమెరికా వెళ్లాలంటే జి ఆర్ ఈ /టోఫెల్ పరీక్షలు రాయవలసి ఉంటుందని అందువల్ల 7వ తరగతి నుండే టోఫెల్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేద్దామని ముఖ్యమంత్రి తనతో చెప్పారని అన్నారు. ఇవన్నీ చేస్తున్నది ఓట్ల కోసం కాదని, విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఎంతవరకైనా ఎన్ని లక్షలైనా చదివించుటకు ముఖ్యమంత్రి జగనన్న సిద్ధంగా ఉన్నారని, కావున విద్యార్థులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు, జిల్లా పేరు ప్రతిష్టలు పెంచే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ లకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. గత ఏడాది కంటే 10లో 2023 మార్చి ఫలితాలు 10 శాతం పెరిగాయని అలాగే 2024 మార్చిలో మరింత ఉత్తీర్ణత శాతం పెంచుటకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. వేల కోట్లు ప్రభుత్వం వ్యయంచేసి పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు డిజిటల్ తరగతులు ట్యాబ్స్ పంపిణీ విద్యా కానుక పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ఫలితాలు బాగా వస్తున్నాయని అన్నారు. ప్రైవేట్ /కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసుపోమని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను గౌరవించడం కోసం జగనన్న ఆణిముత్యాలు అద్భుత ప్రోగ్రాం అని, ఇది గతంలో లేదని అన్నారు. గతంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో తమ పిల్లలు చదువుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా భావించే వారిని, కానీ పరిస్థితులు మారాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం పై స్థాయిలో సిఫార్సులు కోసం రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని, ముఖ్యమంత్రి చక్కని విజన్ తో ఇది సాధ్యమైంది అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు మీరే అంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మరువరాదని సూచించారు.
నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారని పిల్లలు పనికి కాదు బడికి పంపాలని అమ్మ ఒడి అమలు చేస్తున్నారని అన్నారు
ముడా చైర్ పర్సన్ నాగలక్ష్మి దుర్గ భవాని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు.
తొలుత డీఈవో తహెరా సుల్తానా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం వివరాలు, విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో గూడూరు జడ్పిటిసి సురేష్ రంగబాబు, కృత్తివెన్ను జడ్పిటిసి ఎం. రత్నకుమారి, పెడన ఏఎంసీ చైర్ పర్సన్ చారుమతి,పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొనగా,
అధికారులలో జడ్పీ సీఈవో జ్యోతి బసు, ఒకేషనల్ విద్య అధికారి రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ శేఖర్, డిటిడబ్ల్యుఓ పని దూర్జటి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ శ్రీనివాసరావు, ఉప విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు ఎంఈఓ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *